అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యి లిఫ్ట్ లో చిన్నారిపై...

తెలుగు ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన “ఆగడు” చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు చెప్పినటువంటి ” జనాలపై సినిమాల ప్రభావం ఎంతుందో తెలియదు కానీ పంచ్ డైలాగులు ప్రభావం మాత్రం పైగా గట్టిగానే ఉంది” అంటూ చెప్పేటువంటి డైలాగ్ అందరికీ బాగానే గుర్తుంటుంది.అయితే తాజాగా జరిగినటువంటి ఓ సంఘటన బట్టి చూస్తే ఈ డైలాగు నిజమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 Minor Boy Influenced By Movies And Kiss Attempt On 8 Years Old Girl In Lift-TeluguStop.com

కాగా తాజాగా 15 సంవత్సరాలు కలిగినటువంటి మైనర్ బాలుడు 8 సంవత్సరాలు కలిగిన మైనర్ బాలిక ని లిఫ్ట్ లో వెళుతుండగా పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో 8 సంవత్సరాలు కలిగిన ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక నగరంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది.

 Minor Boy Influenced By Movies And Kiss Attempt On 8 Years Old Girl In Lift-అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యి లిఫ్ట్ లో చిన్నారిపై…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటీవలే పని నిమిత్తమై చిన్నారి బాలిక తన అపార్ట్ మెంట్ లో ఉన్న లిఫ్ట్ ని ఉపయోగించి క్రిందకు వెళ్ళింది.అయితే పని ముగించుకొని తన ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్టులో తనతోపాటు అదే అపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న వాచ్ మెన్ కొడుకు కూడా బాలికతో కలిసి వెళ్ళాడు.

ఈ క్రమంలో లిఫ్ట్ లో బాలిక మరియు బాలుడు మాత్రమే ఉండటంతో బాలుడు బాలికను గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.

దీంతో భయపడిన చిన్నారి ఏడుస్తూ వెళ్లి తన తల్లితో ఈ ఘటన గురించి తెలిపింది.

దీంతో బాలిక తల్లి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను ఈ మధ్య అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, తదితర చిత్రాలను చూశానని దాంతో తనకు కూడా ఆ చిత్రాలలో మాదిరిగా అలా ముద్దు పెట్టుకోవాలని బాలికను ముద్దుపెట్టుకున్నానని తెలిపాడు.

దీంతో బాలుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ క్లాసుల పేరుతో చిన్నపిల్లలు సెల్ ఫోన్లను బాగా ఉపయోగిస్తున్నారని ఈ క్రమంలో ఇలాంటి చిత్రాలు మరియు వీడియోలు చూస్తూ తప్పుదోవ పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Arjun Reddy #Boy Influenced #Boy #Dear Comrade

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు