రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఆస్పత్రులను నాడు నేడు కింద అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని స్పష్టం చేసారు.వైద్య ఆరోగ్య రంగానికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారనీ అందుకే యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టామని ఆమె తెలిపారు.
చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురారనీ…అధికారం లేనప్పుడు మాత్రం ఎన్టీఆర్ పేరు జపిస్తారనీ ఆరోపించారు.విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్‌లో అర్బన్ హెల్త్ సెంటర్ ని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఢిల్లీ రావు , కమిషనర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ప్రారంబించారు.
ఈ సందర్భంగా గా మంత్రి విడదల రజని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఆస్పత్రులను నాడు నేడు కింద అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్రానికి కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తెస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఏటా 13 వేల కోట్లు వైద్యం, ఆరోగ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు.ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ ఆరోగ్య రంగానికి ఎన్నో సేవలు చేశారనీ గుర్తు చేశారు.ఆరోగ్యశ్రీని చూసి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్యక్రమం ను తీసుకొచ్చిందని తెలిపారు.
జగన్ కు టీడీపీ వారి కంటే ఎన్టీఆర్ మీద ఎక్కువ అపార ప్రేమ, అభిమానం ఉన్నాయన్నారు.భవిష్యత్లో ఆయన ఖ్యాతి పెంచే విధంగా జిల్లాల పునర్ విభజనలో బాగం గా ఈ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.
వైద్య ఆరోగ్య రంగానికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారనీ అందుకే యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టినట్లు వెల్లడించారు.చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురారనీ…అధికారం లేనప్పుడు మాత్రం ఎన్టీఆర్ నామం జపిస్తారనీ ఆరోపించారు