ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మారుతున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) మంచి స్పీడ్ మీద ఉంది.
ఆ పార్టీ అధినేత జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.దీనిలో భాగంగా అనంతపురంలో జరిగే సభా కార్యక్రమాలు గురించి మంత్రి ఆర్కే రోజా( Minister RK Roja ) మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా విపక్ష పార్టీలపై నాన్ లోకల్ పొలిటిషియన్స్ అని మండిపడ్డారు.వచ్చే ఎన్నికలలో నాన్ లోకల్ పొలిటిషియన్స్ నీ పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
సీఎం జగన్ ( CM Jagan )ఎన్నికల శంఖారావం పూరించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న సభలు చూస్తుంటే ఎన్నికలకు జగన్ సిద్ధమయ్యారని అందరికి అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ఆ ఎన్నికల సభకు వస్తున్న జనం చూస్తే రాష్ట్రం మొత్తం జగన్ వైపే ఉన్నారని.మరోసారి జగన్ ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపక్షాలకు అర్థమైందని పేర్కొన్నారు.ప్రతిపక్షాలలో నాన్ లోకల్ పొలిటిషయన్స్ ఉన్నారని వారిని ప్యాక్ చేసి హైదరాబాద్ కి పార్సిల్ పంపించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.రాయలసీమలో గత రెండు ఎలక్షన్లలో అనంతపురంలో వైసీపీ అత్యధికమైన సీట్లు గెలిచింది.
ఈసారి కూడా.జగనన్నకి అండగా నిలబడుతుంది.
అలాగే జగనన్న గెలిస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది.ఖచ్చితంగా అనంతపురం మీటింగ్ సూపర్ సక్సెస్ అవుతుందని మంత్రి రోజా చెప్పుకోచ్చారు.