ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.జనవరి 21వ తారీకు నాడు కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులతో సమావేశం అవుతున్నారు.
ఇదే సమయంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించిన నాయకులను కలుస్తున్నారు. ఈ సమావేశాలలో వైసీపీ, టీడీపీ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఆ రెండు పార్టీలు బీజేపీకి బానిసలు అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలవాలని చెప్పుకొస్తున్నారు.
రాహుల్ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి( AP Special Status ) సంబంధించి మొదటి సంతకం చేస్తారని అంటున్నారు.ఈ క్రమంలో వైసీపీ నేత మంత్రి రోజా( Minister Roja ) కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.షర్మిల మాటలను ఎవరు నమ్మేందుకు సిద్ధంగా లేరు.రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది.వైయస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి కాంగ్రెస్ అవమానించింది.అలాంటి పార్టీకి రాష్ట్రంలో ఓటు అడిగే అర్హత లేదు.
కాంగ్రెస్ లోకి ఎవరు వచ్చినా జీరోలే అవుతారు.షర్మిల కూడా జీరోనే అని మంత్రి రోజా మండిపడ్డారు.