ఎట్టకేలకు ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారబోతోన్న బుద్ధవనం ప్రారంభమైంది.బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి బుద్ధవనంను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాగార్జున సాగర్ లో 274 ఎకరాల్లో రూ.70 కోట్లతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా బుద్ధవనం రూపు దిద్దుకుంది.ఇక్కడ బౌద్ధ సంస్కృతిని విస్తరించేలా..బౌద్ధుని జీవిత చరిత్రను శిల్పాల రూపంలో ఒకే చోటుకి చేర్చింది తెలంగాణ పర్యాటక సంస్థ.బుద్ధ వనంలో చేపట్టిన అపురూప నిర్మాణాలను కేబినెట్ మంత్రులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు.
పూర్తిగా విదీశీ పరిజ్ఞానంతో నిర్మించిన మహాస్థూపాన్ని పరిశీలించి ప్రశంసించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణలో బౌద్ధ సంస్కృతిని పరిరక్షించుకుందామన్నారు.త్వరలో ఆధ్యాత్మిక గురువు దలైలామాచే అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు.
బుద్ధవనంలో భౌద్దానికి సంబంధించిన యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని చాకలిగుట్ట పక్కనే ఉన్న 400 ఎకరాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు.పీపీపీ పద్దతిలో ఇక్కడ కాటేజ్ ల నిర్మాణం చేపట్టి పర్యాటకులకు మంచి ప్రశాంతత వాతావరణం కల్పిస్తామన్నారు.
బుద్ధుడు మన దేశంలో పుట్టడమే గర్వ కారణమని, ఆయన శిష్యులు ప్రపంచ దేశాలకు ఆయన గొప్ప సారాంశాన్ని తీసుకెళ్లారు.ఫణిగిరి, దూళికట్ట, నేలకొండపల్లి బౌద్ధ పర్యాటక ప్రాంతంగా రూపొందిస్తామన్నారు.