పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం 3వ, వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కుట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.గడపగడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూగత ప్రభుత్వం టిట్కో ఇల్లు నిర్మాణం ప్రారంభించినప్పుడు లాభాలు చూసుకున్నారు కానీ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు చూడలేదని మండిపడ్డారు.
చంద్రబాబు ఎల్.ఎన్.టీ కంపెనీతో కుమ్మక్కయి లక్షల కోట్లు దోచుకున్నారన్నారు.టిడిపి హయాంలో ఇసుక పేరుతో దెందులూరు ఎమ్మెల్యే దోపిడీ చేశారని ఆ దోపిడిని అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షి పై దాడి చేసారన్నారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సైతం టిడిపి నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.