కంగ్రాట్స్ అంటూ భర్త రానాకు మిహీకా లేఖ... ఎందుకంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దగ్గుబాటి వారసుడిగా లీడర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి నేడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Mihika Letter To Her Husband Rana By Saying Congrats Do You Know Why, Rana, Toll-TeluguStop.com

ఇకపోతే ఈ హీరో 2020 కరోనా సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె మిహీకా బజాజ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా రానా భార్య మిహీకా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రానా హీరోగా లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా పన్నెండు సంవత్సరాలు కావడంతో దిగ్విజయంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మిహీకా రానాకు కంగ్రాట్స్ తెలియజేశారు.

రానా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన తొలి చిత్రం ‘లీడర్‘ ఈ సినిమా నుంచి ఒక ఫోటో షేర్ చేసిన మిహీకా “12 సంవత్సరాల కష్టం ” అని రాశారు.అదే విధంగా రానా నటించిన ‘భీమ్లా నాయక్‘ నుండి డేనియల్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి పోస్టర్‌ను పంచుకుంటూ, ఇది “12 సంవత్సరాల అభివృద్ధి” అని రాసారు.

ఈ విధంగా ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 12 సంవత్సరాలు పూర్తి కావడంతో తన భర్తకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియ జేశారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది ఈ బళ్ళాల దేవుడికి శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ రానా నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నేడు జరుగనుంది ఇక ఈ సినిమా 25వ తేదీ విడుదల కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube