బెండ పంటను ఆశించే హెలికోవేర్పా గొంగళి పురుగులను అరికట్టే పద్ధతులు..!

బెండ పంట( Lady finger crop )ను ఆశించి తీవ్ర నష్టం కలిగించే హెలికోవేర్పా గంగోలి పురుగులు ఆర్మీగెరా జాతికి చెందినది.ఈ పురుగులు లేత గోధుమ రంగులో ఉంటాయి.

 Methods To Prevent The Helicoverpa Caterpillars That Expect The , Lady Finger C-TeluguStop.com

ఇవి మూడు నుంచి నాలుగు సెంటీ మీటర్ల వెడల్పు ఉండి రెక్కలను కలిగి ఉంటాయి.వీటి శరీరంపై నల్లని చిన్నచిన్న చుక్కల మచ్చలు కలిగి ఉండి, ముదురు రంగు తలను కలిగి ఉంటాయి.

ఇవి పక్వ దశ పూర్తి చేసుకున్నప్పుడు మట్టిలో ప్యూపా గా రూపాంతరం చెందుతాయి.బెండ పంట మొగ్గ, కాయ వృద్ధి చెందే సమయాలలో వీటి జనాభా చాలా అధికంగా అభివృద్ధి చెంది పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి.

బెండ మొక్కల పువ్వుల చుట్టూ గుంపులు గుంపులుగా తెల్లని నుంచి గోధుమ రంగు గుడ్లను చూడవచ్చు.వీటి లార్వాలు మొక్కలో ఉండే అన్ని భాగాలను తింటాయి.బెండకాయలకు రంధ్రాలు వేసి లోపల ఉండే గింజలను అమాంతం తినేస్తాయి.దీంతో కణజాలం దెబ్బతిని కుళ్ళిపోతుంది.ఈ పురుగులు పంటను ఆశించకుండా ఉండాలంటే.సీజన్ లో ముందుగా పంట వేసి ఈ పురుగుల జనాభా బాగా వృద్ధి చెందక ముందే పంట కోతకు వచ్చేటట్లు ప్రణాళిక రూపొందించుకుని సాగు చేపట్టాలి.

మొక్కల మధ్య సరైన అంతరాన్ని పాటించాలి.పొలంలో పక్షులు వాడటానికి అక్కడక్కడ కర్రలను ఏర్పాటు చేస్తే.

పక్షులు ఈ పురుగులను తినేస్తాయి.

మొక్కలపై లార్వాలు లేదా గుడ్లు గమనిస్తే ఆ మొక్కలను పీకేసి కాల్చి నాశనం చేయాలి.పంట కోతల అనంతరం పంట అవశేషాలను పొలం నుంచి పూర్తిగా తొలగించాలి.ఇక ఈ పురుగులను పొలంలో గుర్తించిన తర్వాత వీటిని అరికట్టడం కోసం రసాయన పిచికారి మందులైన.క్లోరోఫెరిఫోస్( Chloroferrifos ), మేథోమిల్ లలో ఏదో ఒక రసాయన మందును 2.5 మి.లీ ను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కల పై భాగాలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube