చిత్రీకరణ తుది దశకు రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ చిత్రం

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు.

 Megha Akash Rahul Vijay S New Film Shoot Is On The Final Schedule , Megha Akash-TeluguStop.com

కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో అనుకున్నది అనుకున్నట్లు షూటింగ్ చేసుకుంటోంది.రెండు షెడ్యూల్స్ చిత్రీకరణతో 90 శాతం రూపకల్పన పూర్తి చేసుకుంది.

ఇటీవలే గోవాలో ముగిసిన రెండో షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ సందర్భంగా *నిర్మాతలు ఏ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ*…గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది.ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.మా సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.అభిమన్యు బద్ది డెబ్యూ డైెరెక్టర్ అయినా పక్కా ప్లానింగ్ తో వేసిన షెడ్యూల్స్ వేసినట్లు షూటింగ్ చేస్తున్నారు.తాజాగా గోవాలో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం.దీంతో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది.

ఇదే స్పీడ్ తో సినిమాను కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం.అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube