ఆచార్య అఫిషియల్‌గా రాబోతున్నాడు

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది.ఈనెల 22న పుట్టిన రోజు జరుపుకోబోతున్న మెగాస్టార్‌ చిరంజీవి మూవీ ఫస్ట్‌లుక్‌ మరియు మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా ఆ సినిమాకు ఒక నిర్మాత అయిన రామ్‌ చరణ్‌ ప్రకటించాడు.

 Mega Star Chiranjeevi 152 Movie Acharya First Look On Birthday, Acharya First Lo-TeluguStop.com

చిరంజీవి 152వ చిత్రంకు ఇప్పటికే ఆచార్య అనే టైటిల్‌ ఖరారు అయ్యింది.అయితే ఆ విషయాన్ని చిరంజీవి ఒక కార్యక్రమంలో పొరపాటున నోరు జారారు.

అయితే అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ మాత్రం ఇప్పటి వరకు రాలేదు.ఆ టైటిల్‌తోనే సినిమా రాబోతుందా లేదంటే మరేదైనా టైటిల్‌ను మార్చారా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.పదేళ్లు గడిచినా కూడా చిరంజీవిపై అభిమానుల్లో ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదని దాంతో వెళ్లడయ్యింది.రామ్‌ చరణ్‌ నిర్మాణంలో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మొదలు పెట్టి దాదాపుగా రెండు ఏళ్లు అయ్యింది.

సైరా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు కరోనా కారణంగా ఆగిపోయింది.లేదంటే ఈ వారం లేదా వచ్చే వారంలో చిరు బర్త్‌డే కానుకగా థియేటర్‌లో ఆచార్య బొమ్మ పడేది.

ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ పున: ప్రారంభం ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ రాలేదు.కనుక వచ్చే ఏడాదిలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ గా కాజల్‌ నటిస్తుండగా ఐటెం సాంగ్‌ ను రెజీనా చేసిన విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube