ఈ మధ్యకాలంలో కొందరు చిన్న చిన్న విషయాలకే నానా రాద్ధాంతం చేస్తూ చివరికి పెళ్లి అనే బంధాన్ని కూడా అపహాస్యం చేస్తున్నారు. తాజాగా ఓ నవ వధువుకి తన కుటుంభ సభ్యులు తన భర్తకి బట్ట తల ఉందని చెప్పకుండా పెళ్లి చేశారు.
దీంతో ఈ బట్ట తల విషయం కాస్త పెళ్లి అయిన నాలుగు రోజులకి ఆమెకు తెలియడంతో వధువు ఏకంగా తన భర్త మరియు కుటుంబ సభ్యులు నమ్మించి తనని మోసం చేశారని అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక నగరానికి చెందినటువంటి ఓ వ్యక్తికి ఇటీవలే ఇదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహం అయ్యింది.
అయితే పెళ్లయిన నాలుగు రోజుల వరకు అంతా బాగానే ఉంది. కానీ నాలుగు రోజుల తర్వాతే ఆ నవ వధువు తన భర్త బట్ట తలను చూసి ఒక్క సారిగా కృంగి పోయింది.
దీనికితోడు తన భర్తకు బట్టతల ఉన్నట్లు తన కుటుంబ సభ్యులు పెళ్లికి ముందు చెప్పకపోవడంతో నవ వధువు మరింత తీవ్ర మనస్తాపానికి గురైంది.దీంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి పోలీసులకు తెలిపి తన భర్తపై ఫిర్యాదు నమోదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్ కి నవ వధువు భర్తని పిలిపించి మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నవ వధువు మాత్రం అతడితో కలిసి జీవించేందుకు అంగీకరించనట్లు సమాచారం.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అంతేకాక ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు కేవలం బట్ట తల ఉందని భర్తను విడిచి పెట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఇలాంటి సంఘటనల వల్ల సమాజంలో మున్ముందు పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా పోతుందని కాబట్టి ప్రతి చిన్న విషయానికి గొడవలు పడకుండా ఇద్దరూ కూర్చుని మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని అంటున్నారు.