హల్ చల్ చేస్తున్న మంచు విష్ణు, సన్నీలియోన్ సరదా రీల్!

మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు’ గా లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రేణుక గా నటిస్తోంది ఇంటర్నేషనల్ సెన్సెషన్ సన్నీలియోన్.

 Manchu Vishnu Sunny Leone Funny Reel On Shooting Location Details, Manchu Vishnu-TeluguStop.com

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్న విష్ణు, సన్నీ సరదాగా ఓ రీల్ చేసారు.

ఈ రీల్ ని ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది సన్నీలియోన్.ఈ రీల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది.

ఓ మాస్క్ పెట్టుకుని నడుస్తూ వస్తున్న విష్ణును బయపెట్టడానికి ట్రై చేసింది సన్నీలియోన్.బయపడినట్టూ నటిస్తూ, ఫన్ చేసాడు విష్ణు.బ్యాక్ గ్రౌండ్ లో ”చూపే బంగారమాయేనే శ్రీవల్లి.” పాట పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా సరదాగా ఉంది.ఈ వీడియోకి… ”అండ్ ఎగైన్ ఎపిక్ ఫెయిల్ ఫర్ మీ.” అని విష్ణు కామెంట్ చేసాడు.

డా.మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్.డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube