కేంద్ర హోంశాఖ అధికారులను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి( Mallu Ravi ) కలిశారు.ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవన్ విభజన, ఆస్తుల పంపకానికి ఇరు రాష్ట్రాల అంగీకార పత్రాలను అధికారులకు అందజేసినట్లు తెలిపారు.
హోంశాఖ త్వరగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణభవన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని మల్లు రవి పేర్కొన్నారు.ఎన్టీఆర్ఎఫ్ ( NTRF )నిధుల గురించి హోంశాఖ అదనపు కార్యదర్శితో చర్చించానన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలిపారు.తెలంగాణకు అదనపు ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై ప్రస్తావించానన్నారు.త్వరలో కేంద్ర అధికారులను కలిసి తెలంగాణ పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.