పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.అయితే ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇలా ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుస 3 పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి కానీ ఇటీవల ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ (Salaar) సినిమా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సంగతి మనకు తెలిసిందే.రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన రెండో భాగంపై ఎంతో ఆసక్తిని నెలకొల్పింది.ఇక రెండో భాగం గురించి ఇప్పటికే ఎంతోమందికి ఎన్నో రకాలుగా సందేహాలు వెళ్లవెత్తుతున్న సంగతి తెలిసిందే.
ఇలా థియేటర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో( Netflix ) ప్రేక్షకులను సందడి చేస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా సలార్ సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా ఈయన సలార్ సినిమా గురించి మాట్లాడుతూ.యాక్షన్, జానపదం, పౌరాణికం, సాంఘిక అంశాలు అన్నీ మేళవించి ప్రశాంత్ సలార్ సినిమా రూపొందించారని వివరించారు.
అయితే సలార్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాకుండా మరి ఏ డైరెక్టర్ అయిన ఈ సినిమాని కనుక చేసి ఉంటే తప్పకుండా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యదని ఆయన కాబట్టి సినిమా హిట్ అయిందని తెలిపారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి పెద్దగా డైలాగ్స్ లేవు ఈ విషయం గురించి కూడా గోపాలకృష్ణ మాట్లాడుతూ మొదటి 30 నిమిషాలు ప్రభాస్ కి డైలాగ్స్( Prabhas Dialogues ) లేకుండా ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అని తెలిపారు.ఈ సినిమాలో కాన్సర్( Khansar ) అనే ప్రాంతాన్ని చరిత్రతో మిక్స్ చేసి నమ్మినట్లుగా చూపించాడు.ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా ఉందని యాక్షన్స్ అన్ని వేషాలు కూడా చాలా అద్భుతంగా చూపించారని గోపాలకృష్ణ వెల్లడించారు ఇక రెండో భాగంపై కూడా అందరిలోనూ అంచనాలు పెంచేలా క్లైమాక్స్ రూపొందించారని సలార్ సినిమాపై గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.