మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎంత లగ్జరీ లైఫ్ ని గడుపుతారో మనందరికీ తెలిసిందే.తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు ప్రతి ఒక్కటి ఖరీదైనవే అని చెప్పవచ్చు.
కోట్లు విలువ చేసే కార్స్, లక్షల విలువ చేసే బట్టలు, వాచ్, చెప్పులు, జ్యువలరీ ఇలా ప్రతి ఒక్కటి ఖరీదైనవే అన్న విషయం మనందరికీ తెలిసిందే.మామూలుగా అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్లు ధరించిన బట్టల గురించి వాచ్ ల గురించి వాటి ఖరీదు గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని షాక్ అవుతూ ఉంటారు.

అలా ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఈ విధంగా ఖరీదైన బట్టలు షూస్ వాచ్లు ధరిస్తూ సోషల్ మీడియా( Social media )లో నిలుస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఇదే విషయంలో మహేష్ బాబు( Mahesh Babu ) పేరు వినిపిస్తోంది.ఇటీవల మహేష్ బాబు మీడియా ముందుకొచ్చారు.
అయితే ఎప్పటి లాగే చాలా సింపుల్ గా, కూల్ గా కనిపించారు.ఈ క్రమంలోనే మహేష్ వేసుకున్న మహేష్ బాబు ధరించిన దుస్తుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియా ఎన్నో చర్చలు జరుగు.
చూడడానికి ఎంతో సింపుల్ గా కనిపిస్తున్న కూడా మహేష్ వేసుకున్న దుస్తుల ధరలు ఏమాత్రం కూల్ కాదు.మహేష్ బాబు వేసుకున్న చొక్కా ఖరీదు అక్షరాలా రూ.17,999.ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన షర్ట్ ఇది.ఈ వార్త తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు.

అంత సింపుల్ గా ఉన్న షర్ట్ ఏకంగా అన్ని వేలా అంటూ నోరెళ్లబెడుతున్నారు.ఇప్పుడు మహేష్ బాబు వేసుకున్న చొక్కా కూడా గుంటూరుకారం కోసం వాడుతున్న డిజైన్లలో ఒకటి.దీనికి సంబంధించి ఆ సినిమాలో మహేష్ స్టిల్స్ ను రిఫరెన్స్ గా చూపిస్తున్నారు అభిమానులు.
ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కారణాలవల్ల వాయిదా పడుతూనే వస్తోంది.