తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.కాంగ్రెస్, బీజేపీ ( BJP party )వంటి పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై యున్న నేపథ్యంలో అధికార బిఆర్ఎస్ పార్టీ ఒక్క అడుగు ముందు నిలిచి ఏకంగా తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది.
అది కూడా నాలుగు స్థానాలు మినహా ఏకంగా 115 స్థానాల్లోని అభ్యర్థులను ప్రకటించి ఒక్కసారిగా పోలిటికల్ హీట్ పెంచారు అధినేత కేసిఆర్.( CM kcr ) అయితే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది.అదేమిటంటే కేసిఆర్ రెండు చోట్ల పోటీ చేయబోతుండడం.
గత కొన్నాళ్లుగా కేసిఆర్ రెండు స్థానాల్లో బరిలో నిలవనున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.వాటిని నిజం చేస్తూ తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో కేసిఆర్ రెండు చోట్ల బరిలో నిలవనున్నారని స్పష్టమైంది.కేసిఆర్ ప్రతిసారి పోటీ చేస్తే గజ్వేల్ తో పాటు ఈసారి కామారెడ్డిలో కూడా పోటీ చేయనున్నారు.
అయితే ఎప్పుడు లేని విధంగా ఈసారి కేసిఆర్ రెండు చోట్ల పోటీ చేసేందుకు ఎందుకు ఆసక్తి చూపుతున్నారనేదే ఆసక్తికరంగా మారింది.మొదటి నుంచి కూడా ఉత్తర తెలంగాణలో బిఆర్ఎస్ కొంత బలహీనంగానే ఉంది.
ముఖ్యంగా కామారెడ్డిలో 1957 నుంచి కాంగ్రెస్ ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు విజయం సాధించదగా.బిఆర్ఎస్ మాత్రం కేవలం మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది.
పైగా ప్రస్తుతం కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ ( Gampa Govardhan )పై ప్రజావ్యతిరేకత ఉన్నట్లు కేసిఆర్ చేయించిన సర్వేలు వెల్లడించయట.అందుకే ఈసారి కేసిఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే అక్కడ గెలవడంతో పాటు ఉత్తర తెలంగాణ ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.అందుకే గులాబీ బాస్ వ్యూహాత్మకంగా గజ్వేల్ తో పాటు కామారెడ్డిని కూడా ఎంచుకున్నాట్లు తెలుస్తోంది.పైగా ఈసారి ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేసిఆర్ ధీమాగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ బలహీనంగా ఉన్న సిట్లపై గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరత ఉంది.అందుకే మెజారిటీ సీట్ల ను సిట్టింగ్ లకే తక్కబెట్టి తాను కూడా రెండు చోట్ల పోటీ చేసేలా కేసిఆర్ ప్లాన్ చేశారని కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.