Mahesh Babu : బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న మహేష్ బాబు.. త్వరలో అక్కడ కూడా మరో మల్టీప్లెక్స్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Mahesh Babu To Open Amb Cinemas In The Gandhi Nagar Area Of Bengaluru-TeluguStop.com

సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్ బాబు.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు.

మహేష్ కేవలం సినిమా రంగంలో మాత్రమే కాకుండా బిజినెస్ రంగంలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతున్నారు.వ్యాపార రంగంలో కూడా మహేష్ బాబు సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

బిజినెస్ ల ద్వారా కూడా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.

Telugu Amb Cinemas, Bengaluru, Gandhi Nagar, Mahesh Babu-Movie

హైదరాబాద్‌లో ఏఎమ్‌బీ మల్టీప్లెక్స్‌( AMB Multiplex ) పేరిట థియేటర్లు రన్‌ అవుతున్నాయి.త్వరలోనే బెంగళూరులోనూ ఈ మల్టీప్లెక్స్ సేవలు విస్తరించేందుకు రెడీ అయ్యారు మహేష్‌. బెంగళూరు( Bangalore )లోని గాంధీ నగర్ ప్రాంతంలో మహేష్ బాబు భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు.

అయితే ఇంతకుముందు సుప్రసిద్ధ కపాలి థియేటర్‌ ఉన్న ప్రదేశంలోనే మహేష్ బాబు తన మల్టీప్లెక్స్‌ను భారీగా నిర్మిస్తున్నారు.దీని నిర్మాణ పనులు శరవేగంగా తిరుగుతున్నాయి.మరికొద్ది నెలల్లో ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభం కానుంది.హైదరాబాద్, చెన్నై నగరాలతో పోలిస్తే బెంగుళూరులో విభిన్న అభిరుచులతో సినీ ప్రియులు ఉన్నారని, ఇప్పుడు వారిని దృష్టిలో ఉంచుకుని బెంగళూరులో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాలని మహేష్‌ ప్లాన్ చేస్తున్నారట.

Telugu Amb Cinemas, Bengaluru, Gandhi Nagar, Mahesh Babu-Movie

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే మహేష్ తెలుగులో చివరగా సర్కారి వారి పాట( Sarakaru Vaari Paata )సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా( Guntur Karam )లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతూనే వస్తోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube