సంక్రాంతికి లేదన్న వారికి మహేష్ బాబు సూపర్‌ ఆన్సర్‌

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ( Mahesh babu )ప్రస్తుతం గుంటూరు కారం సినిమా( Gunturu karam movie )తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్‌( Trivikram Srinivas ) దర్శకత్వం లో రూపొందుతున్న ఆ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.

 Mahesh Babu Clarity About Gunturu Karam Movie Release Date , Mahesh Babu, Guntur-TeluguStop.com

సంక్రాంతికి సినిమా వచ్చేనా లేదా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.ఎందుకంటే ఇప్పటి వరకు షూటింగ్‌ హడావుడిగా జరుగుతున్న దాఖలాలు లేవు.

Telugu Big, Gunturu Karam, Mahesh Babu, Rajamouli, Sreeleela, Tollywood, Trivikr

అందుకే సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.తాజాగా బిగ్ సి( Big C ) వారి మీడియా సమావేశం లో మహేష్ బాబు పాల్గొన్నారు.ఆ సందర్భంగా మీడియా వారు గుంటూరు కారం సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అంటూ ప్రశ్నించిన సమయంలో తప్పకుండా సినిమా సంక్రాంతికి వస్తుందనే సమాధానం మహేష్ బాబు నుండి వచ్చింది.వాయిదా వేయాల్సిన అవసరం లేదని, షూటింగ్ జరుగుతుందని మహేష్ పేర్కొన్నాడు.

మీడియాలో వస్తున్న పుకార్లకు ఇప్పటికి అయినా ఫుల్‌ స్టాప్ పడుతుందేమో చూడాలి.ఇక మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న గుంటూరు కారం సినిమా లో హీరోయిన్స్ గా శ్రీ లీలా( Sreeleela ) మరియు మీనాక్షి చౌదరి లు నటిస్తున్నారు.

Telugu Big, Gunturu Karam, Mahesh Babu, Rajamouli, Sreeleela, Tollywood, Trivikr

దశాబ్ద కాలం తర్వాత మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ కాంబోలో సినిమా రాబోతున్న నేపథ్యం లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని అంతా నమ్ముతున్నారు.ఇక గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోతున్న సినిమా కోసం ఇప్పటికే రాజమౌళి కథ రెడీ చేశాడు.స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు చేయబోతున్న గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు పాన్‌ వరల్డ్‌ మూవీ చేయబోతున్న నేపథ్యం లో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ రెండు సినిమా లు చూస్తామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube