కామారెడ్డిలో కేసీఆర్ : పోటీ భయమా? వ్యూహమా?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అందరికంటే ముందు ఒక అడుగు ముందే ఏకంగా 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ( KCR )కేవలం నాలుగు సీట్లు మాత్రమే పెండింగ్లో పెట్టారు.ఆకరి నిమిషం తలపోట్లు ను అనవసరంగా భావించిన కేసీఆర్ ముందే సీట్ల వ్యవహారాన్ని తేల్చేసుకుంటే ప్రశాంతంగా ప్రచారం చేసుకోవచ్చు అన్న ఆలోచన ల తోనే అభ్యర్థులను ప్రకటించినట్లుగా తెలుస్తుంది.

 Kcr In Kamareddy Fear Of Competition Strategy , Kcr, Telangana Election, Polit-TeluguStop.com

చాలావరకు పాత కాపులనే కొనసాగించిన కేసీఆర్ పూర్తిస్థాయిలో వివాదాస్పదమైన వ్యక్తులు మాత్రమే పక్కన పెట్టారు.కొత్త అభ్యర్థులతో లేనిపోని రిస్క్ ఎందుకు అనుకుంటూ పాతవారిని కొనసాగించినట్లుగా తెలుస్తుంది .

Telugu Ghazwal, Kama, Kcrkama, Observers, Revanth Reddy, Telangana-Telugu Politi

అయితే ఈసారి కేసీఆర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఎన్నుకోవటమే రాజకీయ పరిశీలకు లను ఆశ్చర్యపరిచిన విషయం .నిజానికి కెసిఆర్ గెలుపు గజ్వేల్( Ghazwal ) లో నల్లేరుపై నడకే అన్న విశ్లేషణ ఉంది.మరలాంటప్పుడు ఆయన కామారెడ్డి( Kamareddy ) ని ఎందుకు ఎన్నుకున్నారు అన్నది అర్థం కాని విషయం గా మారింది.అయితే గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించడానికి కంకణం కట్టుకున్న ఈటెల రాజేందర్ ఒకపక్క కొడంగల్ లో తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన కేసీఆర్ ని ఎట్టి పరిస్థితులను గజ్వేల్ లో ఓడించి తీరుతానన్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) శపధాలు మరోపక్క తో అనవసరమైన రిస్క్ ఏందుకు అన్న పార్టీ వ్యూహాత్మక కమిటీ నిర్ణయాన్ని గౌరవించి రెండో స్థానాన్ని ఎన్నుకున్నారని కొంతమంది విశ్లేషిస్తుండగా ఉత్తర తెలంగాణలో పార్టీ ఊపును కొనసాగించాలంటే తాను స్వయంగా అక్కడి నుంచి పోటీ చేయటం మంచిదన్న ఆలోచన తో ముందు చూపుతోనే ఆయన కామారెడ్డిని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Ghazwal, Kama, Kcrkama, Observers, Revanth Reddy, Telangana-Telugu Politi

నిజామాబాద్ ఎంపీ గా కవిత నిలబడుతున్నందున కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం అక్కడి జిల్లా ఎన్నికలపై పడుతుందని .స్వయంగా కేసీఆర్ పోటీ చేస్తున్న జిల్లా కావడంతో అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతాయి అన్న వ్యూహం తోనే ఆయన కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే కేసీఆర్ భయపడి పారిపోతున్నాడని గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ ఏమీ చేయలేనందున ఆయనను ఓడించే పరిస్థితులు అక్కడ ఉన్నాయని, అంధుకే భయపడి కెసిఆర్ పారిపోతున్నాడు అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేసుకుంటున్నాయి.అయితే రాజకీయంలో కేసీఆర్ వ్యూహాలు ఒక పట్టాన అంతుపట్టవు అంటారు.

మరి కెసిఆర్ ది బయమో వ్యూహామో మరికొద్ది రోజుల్లో ఒక అవగాహనకు రావచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube