టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ( Allu Arjun )కు నేషనల్ అవార్డ్ రావడంతో మెగాఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.బన్నీ కష్టానికి ఇంత కాలానికి ఫలితం దక్కిందంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
అదే సమయంలో పుష్ప ది రైజ్ ను వదులుకుని మహేష్ తప్పు చేశారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
వాస్తవానికి సుకుమార్( Sukumar ) మహేష్ ను దృష్టిలో పెట్టుకుని పుష్ప1, ( Pushpa 1 )పుష్ప2 కథలను సిద్ధం చేశారు.అయితే ఈ సినిమా కోసం లుక్ ను మార్చుకోవడం ఇష్టం లేని మహేష్ సున్నితంగా ఈ సినిమాను వదులుకోవడం జరిగింది.ఒకవేళ ఈ సినిమాలో మహేష్ నటించి ఉంటే మహేష్ బాబుకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడంతో పాటు అవార్డ్ కూడా వచ్చేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహేష్ బాబు ( mahesh babu )పుష్ప ది రైజ్ సినిమాకు బన్నీకి అవార్డ్ రావడం విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం మహేష్ రాజమౌళి కాంబో మూవీ అవార్డుల విషయంలో చరిత్ర సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ లో 2024 సంవత్సరం నుంచి పాల్గొననున్నారు.హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
మహేష్ రాజమౌళి కాంబో మూవీలో హాలీవుడ్ యాక్టర్లు కూడా నటించనున్నారని సమాచారం అందుతోంది.మహేష్ జక్కన్న కాంబో మూవీలో ఎన్నో స్పెషాలిటీస్ ఉండటంతో పాటు ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం ( Guntur Kaaram )సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో, భారీ రేంజ్ లో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.