బస్సు యాత్రకు బ్రేక్ ! అభ్యర్థుల ఎంపికపై టీ.టీడీపీ కమిటీ

తెలంగాణ లో టీడీపీ దూకుడు పెంచుతోంది.వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుకునే విధంగా కసరత్తు మొదలు పెట్టింది.

 Break The For Tdp Bus Yatra T.tdp Committee On Selection Of Candidates , Kasa-TeluguStop.com

ఇప్పటికే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.కాంగ్రెస్ వచ్చే నెల మొదటి వారంలో మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతుండగా,  బిజెపి కూడా దానిపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

ఈ మూడు ప్రధాన పార్టీలతో పాటు,  తెలంగాణ టిడిపి( Telangana TDP ) సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఈ మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

Telugu Bakkani Simhulu, Chandrababu, Nannuru Simga, Rammohan Rao, Telangana Tdp,

 ఈ మేరకు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అయిదుగురితో కమిటీ వేయాలని టిడిపి జాతీయ నాయకత్వం సూచించింది.ఈ మేరకు  తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ), సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు( Rammohan Rao ), రావుల చంద్రశేఖర్ రెడ్డి , బక్కని నరసింహులు , అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి లతో కమిటీ వేయాలని నిర్ణయించారు.వీరు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపికి పట్టున్న నియోజకవర్గాలను గుర్తించి,  అక్కడ గెలుపు అవకాశం ఉన్న వారిని అభ్యర్థిగా ఎంపిక చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయకపోయినా, గతంలో టిడిపి గెలుచుకున్న స్థానాలు,  ఇప్పుడు టిడిపికి కలిసి వచ్చే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపాలని నిర్ణయించుకున్నారు.

Telugu Bakkani Simhulu, Chandrababu, Nannuru Simga, Rammohan Rao, Telangana Tdp,

 ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ టిడిపి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఈ నెల 23 నుంచి బస్సు యాత్రను ప్రారంభించాలనుకున్నారు.ఈ మేరకు అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీనిపై ప్రకటన కూడా చేశారు.

అయితే ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికైన ఫోకస్ పెట్టడంతో, ఈ  బస్సు యాత్రను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube