బస్సు యాత్రకు బ్రేక్ ! అభ్యర్థుల ఎంపికపై టీ.టీడీపీ కమిటీ
TeluguStop.com
తెలంగాణ లో టీడీపీ దూకుడు పెంచుతోంది.వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుకునే విధంగా కసరత్తు మొదలు పెట్టింది.
ఇప్పటికే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.కాంగ్రెస్ వచ్చే నెల మొదటి వారంలో మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతుండగా, బిజెపి కూడా దానిపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
ఈ మూడు ప్రధాన పార్టీలతో పాటు, తెలంగాణ టిడిపి( Telangana TDP ) సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఈ మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.
"""/" /
ఈ మేరకు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అయిదుగురితో కమిటీ వేయాలని టిడిపి జాతీయ నాయకత్వం సూచించింది.
ఈ మేరకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ), సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు( Rammohan Rao ), రావుల చంద్రశేఖర్ రెడ్డి , బక్కని నరసింహులు , అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి లతో కమిటీ వేయాలని నిర్ణయించారు.
వీరు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపికి పట్టున్న నియోజకవర్గాలను గుర్తించి, అక్కడ గెలుపు అవకాశం ఉన్న వారిని అభ్యర్థిగా ఎంపిక చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయకపోయినా, గతంలో టిడిపి గెలుచుకున్న స్థానాలు, ఇప్పుడు టిడిపికి కలిసి వచ్చే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపాలని నిర్ణయించుకున్నారు.
"""/" /
ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ టిడిపి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈ నెల 23 నుంచి బస్సు యాత్రను ప్రారంభించాలనుకున్నారు.ఈ మేరకు అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీనిపై ప్రకటన కూడా చేశారు.
అయితే ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికైన ఫోకస్ పెట్టడంతో, ఈ బస్సు యాత్రను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట.
అవార్డుతో శివ కార్తికేయన్ ను సత్కరించిన ఆర్మీ అధికారులు.. ఈ హీరో రియల్లీ గ్రేట్!