మహేష్ - త్రివిక్రమ్ మధ్య డీల్ కుదిరింది

మహేష్ బాబుకి ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది మిత్రుల్లో త్రివిక్రమ్ ఒకరు .సినిమా వాళ్లతో పెద్దగా కలిసి ఉండని సూపర్ స్టార్ , త్రివిక్రమ్,పూరి జగన్నాథ్, శ్రీను వైట్లతో మాత్రం చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు.

 Mahesh And Trivikram Don’t Want To Clash-TeluguStop.com

ఇప్పుడు అదే స్నేహంతో మహేష్ తో ఒక డీల్ కుదుర్చుకున్నాడు త్రివిక్రమ్.

విషయంలోకి వెళ్తే, గత ఏడు రోజుల్లో, రెండుసార్లు మహేష్ ని కలిసాడు త్రివిక్రమ్.

కథాచర్చలు జరుపుతూనే, బ్రహ్మోత్సవం, అ.ఆ చిత్రాల కోసం ఒక డీల్ మాట్లాడుకున్నారు.అదేంటంటే, బ్రహ్మోత్సవం, అ.ఆ ఒకేరోజు విడుదల ఉండకూడదు.బ్రహ్మోత్సవం మే 13న వస్తే, అ.ఆ ని మే 20కి షిఫ్ట్ చేసుకుంటాడు త్రివిక్రమ్.ఒకవేళ మే 20 కి బ్రహ్మోత్సవం విడుదల చేసుకుంటే, మే 13నే అ.ఆ ని తీసుకొచ్చేస్తాడు త్రివిక్రమ్.ఇదే విషయాన్నీ మొన్న బ్రహ్మోత్సవం సెట్లో చర్చించుకున్నారు మహేష్ బాబు – త్రివిక్రమ్.

అందుకే అ.ఆ కి సంబంధించి విడుదల తేదిపై ఎలాంటి క్లూ ఇవ్వలేదు ఇంతవరకు.బ్రహ్మోత్సవం యూనిట్ క్లారిటి ఇస్తే తప్ప, త్రివిక్రమ్ అ.ఆ విడుదల తేదిని ప్రకటించకపోవచ్చు.ఈ రకంగా బ్రహ్మోత్సవం యూనిట్ నుంచి ఒక ప్రకటన కోసం కేవలం మహేష్ అభిమానులే కాదు, అ…ఆ యూనిట్ మొత్తం ఎదురుచూస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube