సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) హీరో గా శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన గుంటూరు కారం సినిమా ( Gunturu karam movie )సరిగ్గా నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా లో మొదట పూజా హెగ్డే ను హీరోయిన్ గా అనుకున్న విషయం తెల్సిందే.
కానీ ఆమె ను తప్పించి శ్రీ లీల ను ఎంపిక చేయడం జరిగింది.పూజా హగ్డే తో తీసిన సన్నివేశాలను కూడా మళ్లీ శ్రీ లీల తో షూట్ చేయడం జరిగిందని వార్తలు వచ్చాయి.
మహేష్ బాబు పట్టు బట్టి మరీ సినిమా లో శ్రీ లీల( Sreeleela ) ను మెయిన్ లీడ్ గా తీసుకున్నాడని అంటారు.త్రివిక్రమ్ ( Trivikram Srinivas )చాలా ఇష్టపడి పూజా ను తీసుకున్నా కూడా మహేష్ బాబు నిర్ణయంకు ఓకే చెప్పాల్సి వచ్చింది.మహేష్ బాబు నిర్ణయం భేషుగ్గా ఉందని తాజాగా విడుదల అయిన పోస్టర్స్ మరియు పాటలను చూస్తే అర్థం అవుతోంది.ఎందుకంటే మహేష్ బాబు అందంకు ఇన్నాళ్ల కి సరైన హీరోయిన్ లభించింది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో మహేష్ బాబు తో ఏ ఒక్క హీరోయిన్ కూడా సెట్ అవ్వడం లేదు.ఆయన అందం ముందు తేలిపోతున్నట్లుగా అనిపిస్తున్నారు.కొందరు సీనియర్ హీరోయిన్స్ తో ట్రై చేయమని అంటున్నారు.శ్రీ లీల కి ఆ ఛాన్స్ దక్కింది.
చక్కగా వినియోగించుకుంటూ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.మొత్తానికి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు మరియు శ్రీ లీల జోడీకి అన్ని వర్గాల నుంచి స్పందన బాగుంది.కనుక మళ్లీ వీరి జోడీని వెండి తెరపై చూస్తామనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.మహేష్ బాబు మరియు శ్రీ లీల జోడీ గుంటూరు కారం తో హిట్ అయితే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ వన్స్ మోర్ అంటూ డిమాండ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.