సాధారణంగా చైనా దేశంలో చైనీస్( Chinese ) తప్ప ఏ భాష మాట్లాడరు అక్కడ యాప్స్, మెషిన్ అన్నీ కూడా చైనీస్ భాషలోనే ఉంటాయి కానీ శంతను గోయెల్( Shantanu Goel ) అనే భారతీయ యాత్రికుడు చైనా విమానాశ్రయంలో తనతో ఒక మెషిన్ హిందీలో( Hindi ) మాట్లాడిందని ఇటీవల పేర్కొన్నాడు.ఈ యంత్రాన్ని చూసి ఆశ్చర్యపోయాయని చెబుతూ తన ఆవిష్కరణను చూపించడానికి ఎక్స్‌లో రెండు ఇమేజ్‌లు పోస్ట్ చేశాడు.
ఒక ఇమేజ్ వేలిముద్రలను స్కాన్ చేసే అనేక యంత్రాలను చూపింది.మరొక ఇమేజ్‌లో హిందీ, చైనీస్ భాషలలో ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చే ఒక మెషిన్‌ను మనం చూడవచ్చు.
మెషిన్ అతని కుడి చేతి నాలుగు వేళ్లను స్కానర్‌పై( Scanner ) నొక్కమని కోరింది.“చైనాలో అడుగుపెట్టాక ఇండియన్ పాస్‌పోర్ట్‌ను గుర్తించడంతో ఈ మెషిన్లు హిందీలో మాట్లాడాయి.” అని అతను పోస్ట్ పెట్టాడు అది చాలా లైక్స్ తో వైరల్ గా మారింది.మెషిన్ ఇతర భాషలు కూడా మాట్లాడతాయా అని కొందరు అడిగారు.“మెషిన్ స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ మొదలైనవి ఉపయోగించింది.భారతదేశం కోసం, అది హిందీని ఎంచుకుంది.
నేను భాషను మార్చగలనో లేదో నాకు తెలియదు.నేను స్క్రీన్‌పై ఏ ఎంపికను చూడలేదు.
” అని సదరు ఇండియన్ వివరించాడు.
హిందీ మాట్లాడేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని, హిందీ తెలియని ఇతర భారతీయులకు మాత్రం ఇది ఉపయోగపడదని పలువురు వ్యాఖ్యానించారు.యంత్రం ఆంగ్లాన్ని ఉపయోగించాలని లేదా మరిన్ని భారతీయ భాషలను అందిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.చైనాలో( China ) చాలామంది భారతీయుల మాతృభాషా హిందీ అని అనుకుంటారని మరికొందరు పేర్కొన్నారు.
చైనా ప్రభుత్వం ఫిబ్రవరి 2017లో విదేశీయుల వేలిముద్రలు, ముఖ చిత్రాలను సేకరించడం ప్రారంభించింది.అక్రమ వలసలను ఆపాలనే ఉద్దేశంతో హోమ్ చైనా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.