తెలుగు సినిమాలతో పాటల రచయితగా అనంత శ్రీరామ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే, దిగు దిగు దిగు నాగ, కళావతి లాంటి ఎన్నో హిట్ పాటలకు రచయితగా పని చేసి అనంత శ్రీరామ్ పాపులారిటీని పెంచుకున్నారు.
పలు రియాలిటీ షోలకు అనంత శ్రీరామ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన అనంత శ్రీరామ్ తన టాలెంట్ తో రచయితగా ఈ స్థాయికి ఎదిగారు.
12 సంవత్సరాల వయస్సులోనే అనంత శ్రీరామ్ పాటలు రాయడం మొదలుపెట్టగా కాదంటే ఔననిలే సినిమాతో పాటల రచయితగా అనంత శ్రీరామ్ కెరీర్ మొదలైంది.అందరివాడు సినిమాలోని పాట ద్వారా అనంత శ్రీరామ్ కు మంచి గుర్తింపు దక్కింది.
తక్కువ వయస్సులోనే తన ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో అనంత శ్రీరామ్ చోటు సంపాదించుకోవడం గమనార్హం.ఇప్పటివరకు అనంత శ్రీరామ్ 1,000 కంటే ఎక్కువ పాటలు రాశారని తెలుస్తోంది.
జీ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న సరిగమప ప్రోగ్రామ్ ప్రోమోలో అనంత శ్రీరామ్ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేసి ఆశ్చర్యపరిచారు.
భమ్ అఖండ సాంగ్ తో పాటు గోపాల గోపాల సినిమాలోని భజే భజే పాటకు డ్యాన్స్ స్టెప్పులు వేసి అనంత శ్రీరామ్ ఆశ్చర్యపరిచారు.అనంత్ శ్రీరామ్ లో అద్భుతమైన డ్యాన్సర్ ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నార్మల్ గా స్టేజ్ పైకి వచ్చిన అనంత శ్రీరామ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్లలా డ్యాన్స్ చేయడం గమనార్హం.
సైలెంట్ గా కనిపించే అనంత శ్రీరామ్ లో కొత్త యాంగిల్ ను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఇన్ని రోజులు డ్యాన్స్ టాలెంట్ ను బయటపెట్టని అనంత శ్రీరామ్ ఈ షో ద్వారా తన ప్రతిభను వెలుగులోకి తెచ్చారు.అనంత శ్రీరామ్ టాలెంట్ ను చూసి నెటిజన్లు ఆయనను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.