స్కిల్ డెవలప్మెంట్ కేసు( Skill Development Case )లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు అరెస్ట్ తో చాలా పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి.
అంతకుముందు ఆయన బయట ఉన్నప్పుడు ప్రజా సమస్యల విషయంలో రకరకాల కార్యక్రమాలతో నిత్యం ప్రజలలో ఉండేవారు.సాగునీటి ప్రాజెక్టుల సందర్శన, నిత్యవసరాల ధరలు పెరగటంపై పోరాటం ఇంకా వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిరసనలు చేపట్టేవారు.
తూర్పుగోదావరి జిల్లాలో మహానాడు( TDP Mahanadu ) జరిగిన అనంతరం మొదటి విడత మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది.ఈ క్రమంలో “భవిష్యత్తు గ్యారెంటీ”( Bhavishyathu Ku Guarantee ) పేరుతో ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు.
గత నెలలో చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) కావడంతో ఈ కార్యక్రమం ఆగిపోయింది.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు “భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమాన్ని కొనసాగించాలని లోకేష్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.చంద్రబాబు స్థానంలో తాను ప్రజలలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.దీంతో “భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమానికి సంబంధించి పార్టీ కార్యక్రమాల నిర్వహణ సమీక్ష పై త్వరలో విస్తృతస్థాయి భేటీ నిర్వహించనున్నారు.
ఇదే సమయంలో “బాబుతో నేను”( Babu Tho Nenu ) కార్యక్రమం కూడా విస్తృతంగా చేపట్టాలని పార్టీ నేతలకు లోకేష్ తెలియజేయడం జరిగింది.ఒకపక్క పార్టీ కార్యక్రమాలతో పాటు మరోపక్క ప్రజా సమస్యలపై కేడర్ వేగవంతంగా ముందుకు కదలాలని లోకేష్ తెలియజేయడం జరిగింది.