మళ్లీ మళ్లీ అదే తరహీ ఫొటోనా అన్నట్టు చిరాకు పడకుండా నెటిజన్లు మాత్రం ఇలాంటి పజిల్ ఫొటోలనే బాగా ఇష్టపడుతున్నారు.ఎందుకంటే ఎంటర్ టైన్ మెంట్ తో పాటు నాలెడ్జ్ పరంగా కూడా ప్లస్ అవుతుందనే భావనతోనే ఇలాంటి ఫొటోను నెట్టింట విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు.
ఇక సహజంగానే నెట్టింట జంతువును కనిపెట్టే ఫొటోలకు బాగానే ఆదరణ ఉంటుంది.ఆ ఫొటోలో సదరు జంతువు ఎక్కడ ఉందనేది గుర్తించడానికి చాలా ఆలోచించాల్సి ఉంటుంది.
కానీ ఇలాంటివే ఇప్పుడు నెట్టింట చెక్కర్లు కొడుతుంటాయి.
ఎందుకంటే చాలామంది ఇప్పుడు కరోనా కారణంగా ఇండ్ల నుంచే పనులు చేస్తుండటంతో వారందరికీ ఇప్పుడు ఇవే పెద్ద టైమ్ పాస్ లాగా మారిపోయాయి.
ఎక్కువగా వీరు చూసే ఫొటోల్లో ఏదైనా అడవిలో ఉండే జంతువులను కనిపించి కనిపించకుండా తీసని ఫొటోలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి.ఇందులో ఇంకా చెప్పాలంటూ క్రూర మృగాల్లోనే అత్యంత తెలివైన జంతువుగా పేరు తెచ్చుకున్న చిరుతకు సంబంధించిన ఫొటోనే ఎక్కువగా వ్యూస్ తెచ్చుకుంటుంది.
పజిల్స్ ఇప్పటి వరకు రారాజుగా చిరుత ఫొటోలు ఉన్నాయి.

ఇక ఇదే కోవలోనే ఇప్పుడు మరో ఫొటో నెటిజన్ల మెదడుకు పరీక్ష పెడుతోంది.అది కూడా ఇంకెవరిదనుకున్నారు చిరుత ఫొటోనే.అయితే ఈ ఫొటో చూస్తుంటే అది అడవి ప్రాంతంలో రాళ్లు, కొండలు ఉన్న ప్రాంతంలలా ఉంది.
ఇక ఆ కొడ మీద ఉన్న రాల్ల మధ్యలో ఓ చిరుత దాగుంది.ఇక దీన్ఇన కనిపెట్టాలంటూ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అభినవ్ గుప్తా ట్విట్టర్ లో పోస్టు చేశారు.
అయితే ఈ ఫొటోను జైపూర్ అరవలి హిల్స్‌కు ఆయన ట్రెక్కింగ్ కోసం వెళ్లినప్పుడు తీయగా దాన్నే ఆయన పోస్టు చేశాడు.దీంతో అది కాస్త వైరల్ అవుతోంది.