ఆ సినిమా కారణంగా మెగా కోడలు అన్ని ఇబ్బందులు పడ్డారా.. బయటపెట్టిన లావణ్య!

అందాల రాక్షసి( Andala Rakshasi ) సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) .

 Lavanya Tripati Sensational Comments On Andala Rakshasi Movie Details, Lavanya T-TeluguStop.com

మొదటి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం వరుసగా తెలుగులో సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో బిజీగా గడిపారు.అంతేకాకుండా ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ సినిమా సమయంలోనే ఈమె ఆయనతో ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవటం జరిగింది.ఇలా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాటి తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇకపోతే ఇటీవల మెట్ల పై నడుస్తున్న సమయంలో ఈమె స్లిప్ కావడంతో తన కాలికి ఫ్యాక్చర్ అయిందని ఈమె వెల్లడించారు.ఇలా కాలు ఫ్రాక్చర్ కావడంతో ఇంటికే పరిమితమైన లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీరు నటించిన సినిమాలలో ఇబ్బంది పడిన సినిమా ఏంటని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు లావణ్య త్రిపాఠి సమాధానం చెబుతాను ఇబ్బంది పడిన సినిమా తన మొదటి సినిమానే అని తెలిపారు.అందాల రాక్షసి సినిమా కోసం తాను చాలా కష్టపడినట్లు వెల్లడించారు.ముఖ్యంగా తనకు భాష రాకపోవడంతో ఎంతో కష్టపడ్డాను.

అలాగే ఆ సమయంలో నాకు క్యారవాన్ లేదు, హెయిర్ స్టైలిష్ లేరు, మేకప్ కూడా ఉండేది కాదు.ఇలా ఈ సినిమా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను కానీ ఈ సినిమాలో నేను నటించిన మిధున పాత్రను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాను అంటూ అందాల రాక్షసి సినిమా గురించి లావణ్య త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube