స్కూల్ నుంచే అడల్ట్ ఎడ్యుకేషన్ ఉండాల్సిందే... కృతి సనన్ ఆసక్తికర వాఖ్యలు

సమాజంలో అప్పుడప్పుడు బయటపడే కొన్ని సంఘటలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా, మరింత భయపెట్టే విధంగా ఉంటాయి.అలాంటి సంఘటనలలో బాయ్స్ లాకర్ రూమ్ సంఘటన ఒకటి.

 Kriti Sanon Says Need To Adult Education In School Stage, Tollywood, Bollywood,-TeluguStop.com

టీనేజ్ యువత ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేసుకొని మాట్లాడుకున్న సంభాషణలు బయటకి రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

టీనేజ్ నుంచే మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, రేప్, అత్యాచారం వంటి విషయాల మీద ఎంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అనే విషయాలు ప్రతి ఒక్కరిని భయపెట్టాయి.ఈ ఘటనపై చాలా మంది విమెన్ యాక్టివిస్ట్స్ స్పందించారు.

అలాగే సమాజంలో మహిళలపై జరిగే సంఘటనలపై తరుచుగా స్పందించే సెలబ్రిటీలు కూడా స్పందించారు.ఈ విషయం మీద కృతి సనన్ తీవ్రంగా స్పందించింది.మనం ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నామో అన్న సందేహం కలుగుతుంది.ఈ సంఘటన గురించి మొదట విన్నప్పుడు షాక్ అయ్యాను.

వార్త మొత్తం చదివేందుకు ఇబ్బందిగా అనిపించింది.మామూలుగా అయితే అబ్బాయిలు అమ్మాయిల గురించి మాట్లాడుకోవడం కామన్.

కాని దానికి ఒక హద్దు ఉంటుంది.సెక్సీగా ఉంటుందని మాట్లాడుకోవడం వరకు పర్వాలేదు కాని వారు మరీ శృతిమించారు.

అమ్మాయిు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అనే దోరణిలో పిల్లలు ఉన్నారు.వారి తీరు మారాలి.

అందుకు గాను స్కూల్లో అడల్ట్ ఎడ్యుకేషన్ తీసుకు రావాలి.అప్పుడే అబ్బాయిలు అమ్మాయిల గురించి తప్పుగా ఆలోచించడం తప్పుగా ప్రవర్తించడం మానేస్తారంటూ ఈ సందర్బంగా కృతి సనన్ చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube