ఖైదీలకు కరోనా.... జైలు నుంచి గృహ నిర్బంధంలోకి ట్రంప్ సన్నిహితుడు

అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.సాధారణ ప్రజలతో పాటు సమాజానికి దూరంగా జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది.

 Ex-trump Campaign Chair Paul Manafort ,coronavirus Fears, Covid-19,home Quaranti-TeluguStop.com

దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న ఖైదీల్లో 2,800 మందికి కరోనా సోకగా, 50 మంది మరణించినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, ఆయన మాజీ ప్రచార కార్యక్రమ ఛైర్మన్ పాల్‌ మనాఫోర్ట్‌ను జైలు నుంచి విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు.

71 ఏళ్ల మనాఫోర్ట్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించిన కుట్రలో పాలుపంచుకున్నట్లు తేలడంతో న్యాయస్థానం గతేడాది ఆయనకు ఏడున్నర సంవత్సరాల జైలుశిక్ష విధించింది.మనాఫోర్ట్ శిక్ష అనుభవిస్తున్న పెన్సిల్వేనియాలోని ఎఫ్‌సీఐ లోరెట్టో జైలులో వైరస్ సోకిన దాఖలాలు లేవు.

అయితే మార్చి చివరిలో వైరస్‌తో ముప్పు ఉండే అవకాశం వుండి, హింసాత్మక నేరచరిత్ర లేని ఖైదీలను విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచాలని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ (బీవోపీ)ని అటార్నీ జనరల్ విలియం బార్ కోరిన సంగతి తెలిసిందే.

Telugu Covid, Trumpchair, Quarantine-

దీనిపై స్పందించిన పెన్సిల్వేనియా గవర్నర్ ఇలాంటి ఖైదీలను విడుదల చేసి, గృహ నిర్బంధంలో ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఇప్పటి వరకు 1,800 మంది హైరిస్క్ వున్న ఖైదీలను గుర్తించగా, మే 12 నాటికి 150 మందిని విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు.ఈ నేపథ్యంలో మనాఫోర్ట్‌ తరపు న్యాయవాదులు ఉత్తర వర్జీనియాలోని ఆయన ఇంటిలో గృహ నిర్బంధంలో ఉంచాల్సిందిగా న్యాయస్ధానాన్ని కోరారు.

ఇదే సమయంలో ఆయన వయసు, ఆరోగ్య పరిస్ధితులను దృష్టిలో ఉంచుకోవాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కాగా ట్రంప్ వద్ద లాయర్‌గా పనిచేసిన మైఖేల్ కోహెన్ ‌కూడా జైలు నుంచి విడుదల కానున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా కోహెన్ అవకతవకలకు పాల్పడ్డారు.ఈ కేసులో ఆయన అమెరికన్ కాంగ్రెస్‌కు తప్పుడు సమాచారం అందించినట్లుగా తేలడంతో కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది.

దీంతో కోహెన్‌ను న్యూయార్క్‌లోని ఓటీస్‌విల్లీ జైలుకు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube