స్టార్ హీరోలపై కోట శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్.. ఎన్టీఆర్ ను ముసలోడు అనలేదంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాసరావు( Kota Srinivasa Rao ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.పదేళ్ల నుంచి సినిమా లేదని ఇప్పుడంతా సర్కస్ అని ఆయన అన్నారు.

 Kota Srinivasaro Shoking Commets Goes Viral In Social Media Details Here , Kota-TeluguStop.com

ఇప్పటి యంగ్ హీరోలకు సాధన తక్కువ వాదన ఎక్కువ అని కోట తెలిపారు.విజ్ఞానం పెరగాలి కానీ విజ్ఞానం పెరిగి జ్ఞానం పోగొట్టుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

సినిమా అంటే నమ్మించడం అని కోట పేర్కొన్నారు.

సినిమా చూసొచ్చిన వాళ్లు భలే ఉందని అనాలని ఆయన కామెంట్లు చేశారు.

నేను సినిమా కోసం ప్రయత్నం చేయలేదని కోట అన్నారు.సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్లు ఊరికి వచ్చారంటే పరుగెత్తేవారని ఆయన తెలిపారు.

జంధ్యాల( Jandhyala ) గారికి నేను బెజవాడలో బాగా పరిచయం అని కోట వెల్లడించారు.ప్రస్తుతం హీరోలు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నామని చెబుతున్నారని కోట తెలిపారు.

Telugu Jandhyala, Sr Ntr, Tollywood, Vijayawada-Movie

ప్రస్తుతం చిన్న ఆర్టిస్టులు బ్రతకడం కష్టమైందని చిన్న యాడ్స్ నుంచి పెద్ద యాడ్స్ వరకు అన్ని యాడ్స్ లో హీరోలే నటిస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ ( Sr ntr )60 సంవత్సరాల వయస్సులో డ్యాన్స్ చేసినా ముసలోడు డ్యాన్స్ చేశాడని ఎవరూ అనలేదని ఆయన కామెంట్లు చేశారు.తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు ఇచ్చి వాళ్లను బ్రతికించాలని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Telugu Jandhyala, Sr Ntr, Tollywood, Vijayawada-Movie

కోట శ్రీనివాసరావుకు ఇప్పటికీ అడపాదడపా ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.కోట శ్రీనివాసరావు రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని తెలుస్తోంది.కోట శ్రీనివాసరావు వయస్సు ప్రస్తుతం 75 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

కోట శ్రీనివాసరావు వయస్సు పెరుగుతున్నా సినిమాల్లో నటుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారు.కోట శ్రీనివాసరావు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

టాలెంట్ ఉన్న తెలుగు నటీనటులను ఆయన ఎంతగానో ప్రోత్సహించేవారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube