చిరంజీవి ఎవరికైనా రూపాయి సాయం చేశారా.. కోట షాకింగ్ కామెంట్స్ వైరల్!

చిరంజీవి, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఒక సందర్భంలో కోట శ్రీనివాసరావు చిరంజీవిపై తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు చేశారు.

 Kota Sreenivasarao Shocking Comments About Chiranjeevi Goes Viral In Social Medi-TeluguStop.com

తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిత్రపురి కాలనీలో ఆస్పత్రిని నిర్మించాలని తాను అనుకుంటున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే కోట శ్రీనివాసరావు చిరంజీవి కట్టించే ఆస్పత్రికి ఎవరొస్తారని మొదట కార్మికులకు తిండి పెట్టాలని వెల్లడించారు.

టాలెంట్ ఉన్నా పని దొరకక చాలమంది కృష్ణానగర్ లో ఆకలితో అలమటిస్తున్నారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.చిరంజీవి సినీ కళాకారుడిని కాదని కార్మికుడినని చెబుతారని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే చిరంజీవి ఏ విధంగా కార్మికుడు అవుతారని కోట శ్రీనివాసరావు తెలిపారు.

Telugu Chiranjeevi, Krishnanagar, Tollywood-Movie

చిరంజీవి అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అయితే ఆయన చేసే కామెంట్లు నచ్చవని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.కార్మికుడినని చెప్పే చిరంజీవి ఎవరికైనా రూపాయి సాయం చేశారా అని ఆయన ప్రశ్నించారు.చిరంజీవి ఎవరికైనా సినిమాలలో ఆఫర్లు ఇప్పించారా అని ప్రశ్నించారు.ఎవరైనా తన ఇంటి దగ్గరకు వస్తే తాను 500, 1000 రూపాయలు ఇచ్చి పంపుతానని కోట తెలిపారు.

కష్టాల్లో ఉన్న కార్మికుల కొరకు తాను 5 లక్షల రూపాయలు ఖర్చు చేశానని అయితే తాను అది చేస్తానని ఇది చేస్తానని చెప్పనని కోట వెల్లడించారు.కోట శ్రీనివాసరావు ఈ విధంగా చిరంజీవిని టార్గెట్ చేయడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండటం గమనార్హం.

చిరంజీవిపై గతంలో కూడా కోట శ్రీనివాసరావు ఈ విధంగా కామెంట్లు చేశారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో కూడా కోట శ్రీనివాసరావు మంచు విష్ణుకు సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube