Sharmila:షర్మిలకు అన్యాయం చేసిన కోదండరాం..ఎలాగంటే..?

కాంగ్రెస్ పార్టీ అంటేనే అతిపెద్ద రాజకీయ పార్టీ.ఈ పార్టీలో ఎవరివి కూడా సొంత నిర్ణయాలు ఉండవు.

 Kodandaram Did Injustice To Sharmila How-TeluguStop.com

ఏది చేయాలన్న గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని వర్గాలకు నచ్చాలి.ఏకపక్ష నిర్ణయాలు అసలే ఉండవు.

అలాంటి కాంగ్రెస్( congress ) పార్టీ ప్రస్తుతం తెలంగాణలో పుంజుకుంటుంది.ఈ తరుణంలో కాంగ్రెస్ తో జతకట్టేందుకు ఇతర చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పార్టీ వైఎస్ఆర్ టీపి.షర్మిల( sharmila ) ఈ పార్టీ స్థాపించి తెలంగాణలో ఒకటి రెండు సార్లు పాదయాత్రలు చేసి కాస్త జోష్ పెంచింది.

కానీ అనుకున్నంత నాయకత్వ బలాన్ని మాత్రం సంపాదించుకోలేదు.ఎన్నికల్లో పోటీ చేసే అంత బలం రాలేదు.

చివరికి షర్మిలను కాంగ్రెస్ లో విలీనం చేయాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్( dk shiva kumar ) ఎన్నో వ్యూహాలు పన్నారు.ఢిల్లీ( delhi ) పెద్దలతో మాట్లాడి సయోధ్య కూడ కుదిర్చారు.

Telugu Congress, Kodandaram, Miryalaguda, Paleru, Revanth Reddy, Sharmila, Ysrtp

దాదాపు షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది అనే దశకు చేరుకుంది.కానీ తెలంగాణలో ఉండేటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ విలీనాన్ని అడ్డుకున్నారని చెప్పవచ్చు.దీనికి ప్రధాన కారణం కోదండరాం( kodandaram ).ఎందుకంటే కోదండరాం కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చేందుకు అన్ని విధాల ఒప్పుకున్నారు.ఈ విధంగా రెండు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో కలిసి వచ్చేందుకు రెడీ అవ్వడంతో నాయకత్వం ఆలోచనలో పడింది.ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించింది.

చివరికి షర్మిలను గెట్ అవుట్ అనేసింది.

Telugu Congress, Kodandaram, Miryalaguda, Paleru, Revanth Reddy, Sharmila, Ysrtp

ఎందుకంటే షర్మిల(sharmila) మళ్లీ తెలంగాణలోకి వస్తే ఆంధ్ర పాలకుల చేతిలోకి తెలంగాణ వెళ్ళిపోతుందనే భయంతో ప్రజలు ఉన్నారు.ఆమె పార్టీలోకి వస్తే కాంగ్రెస్ కు,మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతుంది భావించారట కాంగ్రెస్ తెలంగాణ పెద్దలు.దీంతో ఆమె రాకను అడుగడుగునా అడ్డుకున్నారు.

చివరికి వారి పంతాన్ని నెగ్గించుకున్నారు.ఇదే తరుణంలో కాంగ్రెస్ తో కలిసి వచ్చేందుకు కోదండరాం(kodandaram) ఒప్పుకోవడంతో ఆయనను అక్కున చేర్చుకున్నారు.

ఇక కాంగ్రెస్ చివరిదాకా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి చివరి సమయంలో హ్యాండ్ ఇవ్వడంతో షర్మిల తెలంగాణలో ఉన్నటువంటి 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది.అంతేకాకుండా ఆమె పాలేరు( paleru) నియోజకవర్గం మరియు మిర్యాలగూడ(miryala guda) నియోజకవర్గాల నుంచి పోటీకి సిద్ధమయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube