లేఖాస్త్రాలు సంధిస్తున్న కిషన్ రెడ్డి...టార్గెట్ కేసీఆర్ యేనా?

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో చాలా వేగంగా అడుగులు వేస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే  లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 Kishan Reddy Is Meeting The Letters .what Is The Target Kcr Kishan Reddy, Kcr, B-TeluguStop.com

ఇటు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇటు విమర్శనాస్త్రాలు సంధిస్తూ బీజేపీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళే దిశగా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తూ టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇటు బండి సంజయ్ ఈ రకంగా వెళ్తూ ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన పధకాలు, ప్రాజెక్ట్ ల విషయంలో ప్రభుత్వం స్పందించని అలాగే కేటాయింపులు చేయని వాటిని లేఖల రూపంలో కెసీఆర్ కు తెలియజేస్తూ లేఖాస్త్రాల ద్వారా కెసీఆర్ ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు.

ప్రస్తుతం కెసీఆర్ కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానాలపై విరుచుకపడుతున్న పరిస్థితుల్లో ఇటు కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను కెసీఆర్ పట్టించుకోక పోవడమే కాకుండా తిరిగి బీజేపీని విమర్శిస్తున్నారనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కిషన్ రెడ్డి వ్యూహంలా అనిపిస్తోంది.

అయితే కెసీఆర్ మాత్రం కిషన్ రెడ్డి లేఖలపై స్పందించకున్నా సరైన సమయంలో స్పందించి కిషన్ రెడ్డి లేఖలపై స్పష్టమైన సమాధానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.మరి బీజేపీని బలోపేతం చేయాలనే దానిపై కిషన్ రెడ్డి స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తున్న తరుణంలో మరి ఎంత వరకు ఈ వ్యూహం ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న వ్యతిరేకత కంటే ప్రస్తుతం ఉన్నది అంత కంటే పెద్ద వ్యతిరేకత కాదనేది కెసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube