హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతను మొదట రాజావారు రాణి వారు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
అయితే సినీ ఇండస్ట్రీకి రాకముందు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అలా యూట్యూబ్ ద్వారా గుర్తింపు సంపాదించుకొని సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఇటీవలే ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాడు.కిరణ్ అబ్బవరం అనే పేరు వినగానే మొదటగా వినిపించే పేరు ఎస్ ఆర్ కళ్యాణమండపం.
ఈ సినిమా ద్వారా యూత్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కిరణ్ అబ్బవరం.మొత్తానికి కిరణ్ అబ్బవరం మాత్రం మంచి ఫాంలోకి వచ్చాడు.
ప్రస్తుతం పలు సినిమాలలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పుడు సెబాస్టియన్, సమ్మతమే అంటూ రెడీ అవుతున్నాడు.
అయితే ఇతని కెరీర్ మంచి ఊపులో ఉండగానే సోదరుడి మరణం సంభవించడంతో కిరణ్ ఎమోషనల్ అయ్యాడు.తాజాగా హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
కిరణ్ తన సోదరుడిని తలుచుకుంటూ ఎమోషనల్ గా ఒక పోస్టు చేశాడు.
ఏయ్ కిరణ్.మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదు.మన ఇద్దరిలో ఎవరో ఒకరం అయినా ఏదో ఒకటి గట్టిగా సాధించాలిరా అని తనకి వీలైన దానికంటే ఎక్కువ సపోర్ట్ చేసేవాడు.
తన లగ్జరీలను శాక్రిఫైజ్ చేశాడు నన్ను హీరోగా చూడటం కోసం.ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నాను అని అనే టైమ్ కి అతను లోకాన్ని విడిచి వెళ్లాడు.తను ఎప్పుడూ అడిగే వాడు.నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావ్ రా అందరికీ అని.ఏదైనా గట్టిగా సాధించిన తరువాత పరిచయం చేద్దామని అనుకున్నా కానీ ఇలా చేయాల్సి వస్తుందని అనుకోలేదు.నా వెనక ఉన్నది మా అన్న రామాంజులు రెడ్డి.
రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.దయచేసి అందరూ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీ ఆనందం కోసం కష్టపడేవాళ్లుంటారు.అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు అంటూ కిరణ్ ఎమోషనల్ పోస్ట్ చేసారు .