ప్రపంచానికి కరోనా ఎక్స్ పోర్ట్ చేసిన కారణం వల్ల కావచ్చు లేదా భారత్ మరియు సౌత్ చైనా సీ లోని ఇతర దేశాలతో ఘర్షణ వాతావరణానికి కారణమైందని కావచ్చు ప్రపంచ దేశాలన్నీ చైనా పై గుర్రుగా ఉన్నాయి అలాగే చైనాను ఐసోలేట్ చేయడం మొదలుపెట్టాయి.దానితో చైనాకు ఏం పాలుపోవాలో తెలియక తల పట్టుకుంటుంది.
సరిగ్గా ఇలాంటి టైమ్ లో చైనా కు మిత్ర దేశమైన నార్త్ కొరియా భారీ షాక్ ఇచ్చింది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ తాజాగా చైనా నుండి నార్త్ కొరియా వచ్చేవారి పై ‘షూట్ టు కిల్’ ఆదేశాలను జారీ చేశారు.అంతేకాకుండా చైనా నార్త్ కొరియా బోర్డర్ సమీపానికి భారీ ఎత్తున భద్రతా బలగాలను పంపారు.
చైనా మిత్ర దేశమైన నార్త్ కొరియా సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.కరోనా వైరస్ కు పుట్టినిల్లయిన చైనా నుండి వచ్చేవాళ్ళ వల్ల ఎక్కడ నార్త్ కొరియాలో కరోనా వ్యాపిస్తుందో అనే భయంతో కిమ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని దక్షిణ కొరియాలో అమెరికా బలగాల కమాండర్ జనరల్ రాబర్ట్ అబ్రహం అభిప్రాయపడ్డారు.