యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా లో నటిస్తున్న ఆ నటుడు...

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) అంటే తెలుగులోనే కాదు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చాలా ఫేమస్ అయిన హీరో అనే చెప్పాలి ఎందుకంటే ఎన్టీయార్ చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచం మొత్తం మీద చాలా పెద్ద హిట్ అయింది ఈ సినిమా కి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి.ఇక RRR సినిమా తర్వాత ఎన్టీయార్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

 Kgf Actor Tarak Ponnappa In Ntr Devara Movie Details, Ntr,kgf Actor Tarak Ponnap-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది.పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవర( Devara ) అనే టైటిల్ ఖరారు చేశారు.

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా కీలక పాత్రలలో నటించడం కోసం ఇతర భాషలలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి నటీనటులను కొరటాల రంగంలోకి దింపబోతున్నారు…

 Kgf Actor Tarak Ponnappa In Ntr Devara Movie Details, Ntr,kgf Actor Tarak Ponnap-TeluguStop.com
Telugu Tarak Ponnappa, Devara, Koratala Siva, Ntr Devara, Saif Ali Khan-Movie

ఈ సినిమాలో (Devara) హీరోయిన్ గా దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ను( Janhvi Kapoor ) తీసుకున్నారు.అదేవిధంగా పిల్లల పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం విలన్ గ్యాంగ్ లో కీలకపాత్రలో నటించడం కోసం కొరటాల కే జి ఎఫ్ నటుడిని రంగంలోకి దింపారని తెలుస్తుంది.కే జి ఎఫ్ సినిమాలో నటుడిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు తారక్ పొన్నప్పని( Tarak Ponnappa ) తీసుకున్నారు…

Telugu Tarak Ponnappa, Devara, Koratala Siva, Ntr Devara, Saif Ali Khan-Movie

రీసెంట్ గా షూటింగ్ కి అటెండ్ అయ్యాడు.త్వరలో జరగబోయే కొత్త షెడ్యూల్ లోనూ అతడు పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది.ఇలా ఇతర భాషల నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సెలబ్రిటీలు అందరికి దేవర సినిమాలో అవకాశాలు కల్పిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వ ప్రతిభను నమ్మి ఎన్టీఆర్ తనకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు…దీంతో తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం కొరటాల శివ కూడా భారీగానే కష్టపడుతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తేదీ విడుదల కాబోతుందని తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube