భారత్ లోని అమెరికన్ ఎంబసీ కీలక ప్రకటన...

భారత్ నుంచీ ఎంతో మంది విద్యార్ధిని విద్యార్ధులు అమెరికా వెళ్లి చదువుకోవాలనేది కలగా భావిస్తారు.అక్కడే చదువుకుని మంచి ఉద్యోగం సాధించి ఆర్ధికంగా స్థిరపడాలని కలలు కంటుంటారు.

 Key Statement From The American Embassy In India American Embassy, India , Amer-TeluguStop.com

అలాంటి వారందరికీ భారత్ లోని అమెరికన్ ఎంబసీ గుడ్ న్యూస్ ప్రకటించింది.అమెరికాలో చదువుకోవాలని ఎంతో కాలంగా వేచి చూస్తున్న విద్యార్ధులకు త్వరలో మరో సారి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించింది.

అంతేకాదు అమెరికాలో చదువుకోనేందుకు అర్హత గా పొందే ఐ-20 డాక్యుమెంట్స్ ను పొందిన వారు స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని తెలిపింది.

అగ్ర రాజ్యంలో చదువుకోవాలని కలలు కనే విద్యార్ధులు అమెరికాలోని స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫైడ్ వర్సిటీలో లో అడ్మిషన్లు పొందవచ్చు, ఈ వర్సిటీలు విద్యార్ధులకు ఐ-20 ఫామ్స్ ను అందిస్తాయి.

వర్సిటీల నుంచీ ఫామ్స్ పొందిన విద్యార్ధులు ఎంబసీ నిర్వహించే ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి అర్థత పొందుతారు.ఈ ఐ-20 ఫామ్స్ పొందటానికి కేవల అక్కడి వర్సిటీల అనుమతులు మాత్రమే కాకుండా ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాదు ఇందుకోసం భారత్ లోని ఇండియన్ ఎంబసీ ప్రత్యేకంగా విద్యార్ధులకు ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుంది…ఈ ఇంటర్వ్యూలలో విద్యార్ధులు తప్పనిసరిగా అర్హత పొందాలి…అయితే.

Telugu Americ, America, American, India, Visa-Telugu NRI

కొంత కాలంగా ఈ ఇంటర్వ్యూలను ఎంబసీ నిర్వహించలేదు, దాంతో భారత ప్రభుత్వం అమెరికాతో జరిపిన చర్చల ఫలితంగా జూన్, జులై లలో ఇంటర్వ్యూలను మే నెలలో స్లాట్లు ఓపెన్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించింది.అయితే మరో సారి ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఎంబసీ సిద్దమయ్యింది.ఈ మేరకు ఐ -20 ఫామ్స్ ఉన్న విద్యార్ధులు సిద్దంగా ఉండాలని, స్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

ఆగస్టు 14 తరువాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube