తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కీర్తి సురేష్ తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది.
ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పటికే పలుసార్లు కీర్తి సురేష్ కి కాబోయే వరుడు అతనే పెళ్లి ఫిక్స్ రకరకాలుగా వార్తలు వినిపించగా ఆ వార్తలపై కీర్తి సురేష్ స్పందించకపోవడంతో అవన్నీ ఒకే రూమర్సే అని తేలిపోయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ తన 30 వ ఏట అడుగుపెట్టడంతో కీర్తి సురేష్ తల్లిదండ్రులు పెళ్లి విషయంలో ఆమెపై ఒత్తిడి పెట్టడంతో ఆమె చేసేదేమీ లేక పెళ్లి పీటలు ఎక్కడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అలాగే కీర్తి సురేష్ కు ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ఫిక్స్ అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే గత కొన్నాలుగా కీర్తి సురేష్ కోసం వరుడు నీ వెతకగా మొత్తానికి కీర్తి సురేష్ కి కాబోయే వరుడు దొరికాడని, అతను కీర్తి సురేష్ కి కూడా నచ్చడంతో ఇరువురి కుటుంబ సభ్యులు త్వరలోనే పెళ్లి ముహూర్తాన్ని కూడా నిశ్చయించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే పెళ్లి డేట్ గురించి త్వరలోనే అధికారికంగా కీర్తి సురేష్ ప్రకటించనుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే పెళ్లికి ముందే ఓకే చెప్పిన ప్రాజెక్టులన్ని పూర్తి చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే ఆలోచనలో కీర్తి సురేష్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్త విన్న పలువురు సురేష్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే కీర్తి సురేష్ అధికారికంగా స్పందించేంతవరకు వీడియో చూడాల్సిందే మరి.ఇప్పటికే గతంలో కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు అన్నీ కూడా అవాస్తవాలు గానే మిగిలిపోయిన విషయం తెలిసిందే.