Hyper Aadi Sridevi drama company: లేడీ కమెడియన్ ను ముద్దు అడిగిన హైపర్ ఆది.. చివరకు గుండు కొట్టించి?

బుల్లితెర కమెడియన్ హైపర్ ఆదికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్నప్పటికీ ఆది వేసే పంచ్ లపై నెటిజన్లలో ఒకింత నెగిటివ్ ఒపీనియన్ ఉంది.అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా హైపర్ ఆదికి గుండు కొట్టించడం గమనార్హం.

 Huge Shock To Popular Comedian Hyper Aadi Details Here Goes Viral, Comedian Hype-TeluguStop.com

రష్మీ హైపర్ ఆదితో ఒక నంబర్ ను సెలెక్ట్ చేసుకోవాలని ఆ నంబర్ వెనుక ఏం ఉంటే అది మీరు చేసి చూపించాలని చెబుతారు.హైపర్ ఆది వెంటనే నా లక్కీ నంబర్ 9 అని చెబుతాడు.

ఆ నంబర్ వెనుక ఎవరినైనా 30 సెకన్లు కిస్ చేయాలని అని ఉండటంతో హైపర్ ఆది సంతోషిస్తాడు.నాకు నిజంగా ఒకరిని కిస్ చేయాలని ఉందని ఐశ్వర్య పేరు చెప్పగా నరేష్ ఎవ్వరూ లేరు కదా ఐశ్వర్యను పంపించేశాను అని చెబుతాడు.

ఆ తర్వాత నరేష్ మా ప్లానింగ్ లు మాకు ఉంటాయ్ అని చెబుతాడు.ఆ తర్వాత ఐశ్వర్య ఎంట్రీ ఇవ్వగా హైపర్ ఆది ఆమెను స్టేజ్ పైకి రమ్మని చెబుతాడు.

ఆ తర్వాత నరేష్ హైపర్ ఆదిని వేరే నంబర్ సెలెక్ట్ చేసుకోవాలని సూచించాడు.

ఆ నంబర్ వెనుక గుండు కొట్టించుకోవాలి అని ఉండగా ఆదికి ఇష్టం లేకపోయినా ఇతర కమెడియన్లు అతనిని చుట్టుముడతారు.

ఇంద్రజ మాట్లాడుతూ ఆగండి.ఆయనకు ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నాయో అని చెప్పగా బుల్లెట్ భాస్కర్ టాస్క్ అంటే టాస్క్ అని చెప్పారు.

ఆ తర్వాత హైపర్ ఆది గుండుతో అక్కడినుంచి వెళ్లిపోయారు.డిసెంబర్ నెల 4వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Telugu Aishwarya, Bullet Bhaskar, Hyper Aadi, Naresh, Sridevidrama-Movie

హైపర్ ఆది గుండుతో రాబోయే రోజుల్లో కనిపించనున్నారు.టాస్క్ కోసం హైపర్ ఆది గుండు చేయించుకోవడాన్ని కొంతమంది మెచ్చుకుంటుండగా ఎక్కువమంది మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.కొంతమంది మాత్రం ఇచ్చిన టాస్క్ ను పర్ఫెక్ట్ గా పూర్తి చేసిన హైపర్ ఆదిని మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube