ఫామ్ హౌజ్ లో ఏం జరిగింది ? కేసీఆర్ స్పీడ్ కు కారణం ఏంటి ?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా గతం కంటే చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు.ఎప్పుడూ చూపించినంత స్పీడ్ చూపిస్తున్నారు.

 Kcr Is Making Key Decisions Faster Than Ever Before,bandi Sanjay ,bjp, Cm Kcr ,-TeluguStop.com

ఎందుకు ఆందోళన చెందుతున్న మరెందుకో ఆయన భయపడుతున్నారు.ఎప్పుడూ కెసిఆర్ లో ఈ తరహా ఆందోళన కనిపించలేదు.

ఇప్పుడు మాత్రమే ఈ విధమైన వ్యవహార శైలి కనిపించడానికి కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బిజెపి తెలంగాణ లో స్పీడ్ పెంచడంతో పాటు, బలమైన రాజకీయ ప్రత్యర్థిగా మారడం అధికారం దక్కించుకునేందుకు తెలంగాణలో బలపడడం వంటివి కేసిఆర్ కు ఎక్కడలేని ఆందోళనను పెంచుతున్నాయి.

గతంలో ఎప్పుడూ ప్రకటించినంత స్థాయిలో కేసిఆర్ వరుసగా సంక్షేమ పథకాలను ఉద్యోగులకు, ప్రజలకు వరాలు ఇస్తుండడం, ఇలా అన్నిటిలోనూ కెసిఆర్ ఇప్పుడు ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

ఆరేళ్ల కెసిఆర్ పరిపాలన ను, గత వారం రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మార్పు ఎంత వచ్చింది అనేది అర్థం అవుతుంది.

  గత వారం రోజులుగా కేసీఆర్ వరుసగా సంచలన నిర్ణయాలు పెద్ద ఎత్తున తీసుకోవడంపై చర్చ జరుగుతోంది.కెసిఆర్ లో మార్పు రావడానికి కారణం ఏమిటి అని చర్చ తెలంగాణవ్యాప్తంగా జరుగుతోంది.

ఎవరు ఎన్ని డిమాండ్లు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, కేసీఆర్ చాలా విషయాల్లో క్లారిటీ గా ఉండేవారు.ఉద్యమాలను కఠిన నిర్ణయాలతో అణిచివేసేందుకు ప్రయత్నించేవారు.ఇప్పుడు దానికి భిన్నంగా అడగకుండానే అందరికీ వరాలు ఇచ్చేస్తూ ఉండడం, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ఇటీవల కెసిఆర్ చాలా రోజుల పాటు ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు.

ఎవరిని కలిసేందుకు ఇష్టపడేవారు కాదు.ఆ సమయంలోనే పార్టీని రాబోయే ఎన్నికల్లో నూ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఏం చేయాలి అనే విషయం పైన లోతుగా కీలక నాయకులు అందరితోనూ చర్చించినట్లు , అలాగే వివిధ సర్వేలు ద్వారా వచ్చిన రిపోర్టులను పరిశీలించి టిఆర్ఎస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంచనాకు వచ్చారు.

Telugu Bandi Sanjay, Cm Kcr, Delhi, Employees, Farmhouse, Ghmc, Pragathi Bhavan,

బిజెపిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు , అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.అలాగే ఇటీవల కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలను కలిసిన తర్వాత కూడా ఆయనలో స్పష్టమైన మార్పు కనిపించడంతో పాటు, కేంద్రం తీసుకువచ్చిన కొత్త బిల్లులు నిర్ణయాలను సమర్థిస్తూ మాట్లాడుతుండటం పైనా జోరుగా చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube