తాజాగా భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత రక్షణ దళం అయినటువంటి ఆర్మీ మరియు చైనా ఆర్మీ ల మధ్య జరిగిన కొట్లాటలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ కొట్లాటలోమరికొంత మంది జవాన్లు కూడా మృతి చెందారు.
దీంతో చైనా దొంగ దెబ్బకి ఖచ్చితంగా భారత ఆర్మీ ఖచ్చితంగా ప్రతీకారం తెలుసుకోవాల్సిందే అంటూ కొందరు కమ్యూనిస్టులు మరియు ప్రజా సంఘ నాయకులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు.
తాజాగా కాల్పులలో మరణించిన ఆర్మీ జవాన్ల మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు.
ఇందులో భాగంగా పలు సంచలనాత్మకమైన విషయాలు వైద్యులు కనుగొన్నారు.అయితే ఇందులో ముఖ్యంగా భారత ఆర్మీ జవాన్ల పై చైనా ఆర్మీ ఇనుప రాడ్లు మరియు మేకలు కలిగినటువంటి బలమైన ఇనుప పైపులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు.
కల్నల్ సంతోష్ బాబు ముఖంపై కూడా ఈ రాడ్లతో దాడి చేసినటువంటి గుర్తులు బలంగా కనిపిస్తున్నాయి.అయినా తమ ప్రాణాలను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా చైనీయుల అక్రమ చొరబాటును అడ్డుకుని అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకి మరియు 19 మంది జవాన్లకు యావత్ దేశం మొత్తం ఘనంగా నివాళులు అర్పిస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా దేశ రక్షణ లో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా ప్రకటించింది.అంతేకాక కుటుంబంలో సంతోష్ బాబు భార్యకి ఉద్యోగం కూడా కల్పిస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారు.