సాధారణంగా జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలతో దోస్తీ ఉంటుంది.విభేదాలూ ఉంటాయి.
అయితే ఒక రాష్ట్రంలో అధికార పక్షంతో దోస్తీ ఉంటే.ప్రతిపక్షంతో విభేదాలు ఉంటాయి.
లేదా ప్రతిపక్షంతో దోస్తీ ఉంటే అధికార పక్షంతో విభేదించడం సహంజ.అయితే ఒకే రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలతో కలిసి ఉంటూ మేనేజ్ చేయడం అరుదుగా ఉంటుంది.
ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతోంది.కేంద్రంలోని బీజేపీ ఏపీలో ఉప్పు నిప్పుగా ఉన్న వైసీపీ, టీడీపీలను రెండింటిని మెనేజ్ చేస్తోంది.
ఇద్దరి సపోర్ట్ తీసుకుంటూ రాజకీయం చేస్తోంది.ఇందులో ఆ పార్టీలకు కూడా అవసరం ఉండటంతో అలా సాగుతోంది.
తమ వైపు నుంచి మాత్రమే వారు చూసుకుంటూ వస్తున్నారు.అందుకే ఏపీలో రెండు బడా పార్టీల అధినేతలను చాలా సులువుగా మేనేజ్ చేసేలా ఎత్తులు వేస్తున్నారు.
గతంలో జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు మోడీని.కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనుకుండా కేవలం చంద్రబాబు మీదనే విమర్శలు చేస్తూ వచ్చారు.ఇక అప్పట్లో ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మోడీతో జగన్ కి అపాయింట్ మెంట్ కూడా ఉండేది.అయితే గత ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్డీఏకి దూరం అయ్యారు.
మూడేళ్లుగా బాబుని దూరం పెట్టిన బీజేపీ ఇపుడు ఆయనతో నవ్వులు చిందిస్తోంది.రీసెంట్ గా బాబుకు ఢిల్లీ ఆహ్వానం అందగా అక్కడ మోడీతో బాబు కలసిన లేటెస్ట్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
అయితే వైసీపీ మాత్రం దీని మీద మంటగా ఉంటోంది.అపుడే వైసీపీ కీలక నేతలు సజ్జల రామక్రిష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి బాబు మోడీ భేటీ పై అంత సీన్ లేదంటూ చెప్పేస్తున్నారు.

దీంతో వైసీపీ మంటను అర్ధం చేసుకున్నట్లుగా కేంద్ర పెద్దలు కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు.నీతి అయోగ్ మీటింగ్ లో భాగంగా మోడీ జగన్ ని ప్రత్యేకంగా లంచ్ కి ఆహ్వానించారు.ఆయనతో కలసి టేబుల్ ని పంచుకున్నారు.ఇలా జగన్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మోడీ వైసీపీ కూడా తమకు చాలా ముఖ్యమన్న సందేశాన్ని పంపించారు.దీన్ని చూసిన వారికి మాత్రం ఒక విషయం అర్ధం అవుతోంది.ఏపీలో రెండు ప్రధాన పార్టీలను మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు.
అయితే ఏపీలో జగన్, బాబు ఇద్దరూ బీజేపీని వీడేందుకు ఇష్టపడకపోవచ్చు అంటున్నారు.మొత్తానికి ఎవరి రాజకీయ అవసరాలను అనుగుణంగా వారు మెదులుతున్నారని అంటున్నారు.
.