టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal agarwal ) తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా బాలయ్య కాజల్ కాంబినేషన్ లో సినిమా రావడానికి చాలా సమయం పట్టింది.కెరీర్ తొలినాళ్లలో రవితేజ మినహా యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో మాత్రమే నటించిన కాజల్ అగర్వాల్ గత కొన్నేళ్లలో రూట్ మార్చి సీనియర్ హీరోలతో నటించడానికి సైతం ఓకే చెబుతున్నారు.
ఇప్పటికే చిరంజీవికి జోడీగా పలు సినిమాలలో నటించిన కాజల్ బాలయ్యకు జోడీగా భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari )లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో కాత్యాయని అనే సైకియాట్రిస్ట్ రోల్ లో కాజల్ ( Kajal agarwal )కనిపిస్తుండగా సినిమాలో కాజల్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ బాలయ్య, శ్రీలీల కాంబినేషన్ సాంగ్స్ కావడంతో బాలయ్య, కాజల్ కాంబోలో సాంగ్స్ ఉంటాయా లేదా అనే ప్రశ్న సైతం ఎదురవుతోంది.బాలయ్య ఫ్లాష్ బ్యాక్ గురించి కూడా ట్రైలర్ లో ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు.

అయితే కాజల్ అగర్వాల్ బాలయ్యను( Nandamuri Balakrishna ) ముద్దుగా బ్యాల్స్ అని పిలుస్తారట.భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో కాజల్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.నా పేరు బ్యాల్స్ నువ్వు అలానే పిలవాలని బాలయ్య సూచించారని అందుకే అలా పిలుస్తున్నానని ఆమె పేర్కొన్నారు.మొదట బాలయ్యను సార్ అని పిలిచేదానినని కాజల్ చెప్పుకొచ్చారు.
బాలయ్య డౌన్ టు ఎర్త్ ఉంటారని ఆయనను ఫ్రెండ్ లా ఫీలవుతానని కాజల్ అగర్వాల్ కామెంట్లు చేశారు.
బాలయ్య ఆకాశం అంత ఎత్తుకు కూడా కాదని ప్లానెట్ అంత ఎత్తుకు ఎదగాలని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.ఒక్కరోజులోనే ఈ సినిమా ట్రైలర్ కు 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
బాలయ్య కాజల్ కాంబోలో తెరకెక్కిన తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్నిఅందుకుంటుందో చూడాలి.