పెట్రోలు, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నందున ప్రజలు పెట్రోల్ బైక్‌ల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ( electric scooters )మారుతున్నారు.అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి హీరో ఎలక్ట్రిక్ మంచి ఎంపిక.
హీరో ఎలక్ట్రిక్ ఒక సంవత్సరం క్రితం అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మిన పాపులర్ కంపెనీ, కానీ ఇప్పుడు మార్కెట్లో ఓలా, ఏథర్, TVS, బజాజ్, ఆంపియర్, ఒకినావా వంటి అనేక కంపెనీలు దానికి పోటీగా ఉన్నాయి.దీంతో హీరో ఎలక్ట్రిక్ మార్కెట్ షేర్ కాస్త తగ్గింది.
అయినప్పటికీ, హీరో ఎలక్ట్రిక్ ఇప్పటికీ అట్రియా LX, ఫ్లాష్ LX ( Atria LX, Flash LX )వంటి అనేక అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో ఎక్కువ సేల్స్ నమోదు చేస్తోంది.ఈ రెండు స్కూటర్లను కేవలం రూ.10,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు.ఆ వివరాలు తెలుసుకుందాం.హీరో ఎలక్ట్రిక్ అట్రియా LX ధర రూ.77,690 (ఎక్స్-షోరూమ్).దీని టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది 85 కి.మీ రేంజ్ అందిస్తుంది.స్కూటర్‌ను ఫైనాన్స్‌లో తీసుకోవాలనుకుంటే రూ.10,000 డౌన్ పేమెంట్ చేసి 9% వడ్డీ రేటుతో రెండేళ్లలో రూ.67,690 ఈఎంఐ చెల్లించాలి.అంటే మీరు 2 ఏళ్ల పాటు మంత్లీ రూ.3,092 ఈఎంఐ చెల్లించాలి.
హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ LX ధర రూ.59,640 ఎక్స్-షోరూమ్.దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 85 కి.మీ.స్కూటర్‌ను ఫైనాన్స్‌లో తీసుకోవాలనుకుంటే, మీరు 9% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో రూ.10,000 డౌన్ పేమెంట్, రూ.47,640 ఈఎంఐ చెల్లించాలి.అంటే మీరు 2 సంవత్సరాల పాటు మంత్లీ రూ.2,268 ఈఎంఐని చెల్లించాలి.