సంతోష్ శోభన్హీరోగా నటించిన తాజా చిత్రం ప్రేమ్ కుమార్( Prem Kumar ).అభిషేక్ మహర్షి దర్శకుడుగా,సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ గురువారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ కొన్ని తెలుగు సినిమాల క్లైమాక్స్ సన్నివేశాల గురించి తెలిపారు.చాలా సినిమాలలో పెళ్లి పీటల మీద హీరోయిన్ వేరే వ్యక్తి పెళ్లి చేసుకుంటే హీరో వచ్చి చివరికి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటారు.
అయితే ఆ పెళ్ళికొడుకు పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఎవరు ఆలోచించరు.
ఇలా ఆ పెళ్లి కొడుకు( Groom ) పరిస్థితి గురించి ఆలోచింపజేసే చిత్రమే ఈ ప్రేమ్ కుమార్ అని తెలియజేశారు.ఈ సినిమా చాలా విభిన్నంగా ఉండబోతుందని ఈయన తెలిపారు.ఈ సందర్భంగా సంతోష్ శోభన్( Santosh Shoban ) మాట్లాడుతూ నాకు ఇప్పటివరకు ఒక సినిమా కూడా థియేట్రికల్ సక్సెస్ రాలేదు.
అయితే ఈ సినిమా ఆ లోటును తీర్చుతుందని భావిస్తున్నా.నాకు పెళ్లిబట్టలు చూస్తేనే చాలా డిప్రెషన్ వస్తుందని సంతోష్ శోభన్ వెల్లడించారు.ఈ పెళ్లి తథంగానికి దూరంగా ఉంటే మంచిదనిపిస్తుందని తెలిపారు.
ఇక తాను పెళ్లి( Marriage ) చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ మ్యారేజ్ ( Register Marriage ) చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి సంతోష్ శోభన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన తదుపరి సినిమాల గురించి కూడా తెలియజేశారు.తన తదుపరి సినిమాలను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అలాగే యు వి క్రియేషన్ బ్యానర్ లో రాబోతున్నాయి అంటూ సంతోష్ శోభన్ వెల్లడించారు.