యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనతో కలిసి నటించిన నటీనటులకు ఎంతో గౌరవం ఇస్తారనే సంగతి తెలిసిందే.తనకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వడానికి ముందువరసలో ఉండే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు.
స్టూడెంట్ నంబర్1 సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళిని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.స్టూడెంట్ నంబర్1 సక్సెస్ సాధించడంతో అటు ఎన్టీఆర్ కెరీర్ ఇటు జక్కన్న కెరీర్ పుంజుకుందనే సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో సింహాద్రి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో రమ్యకృష్ణ డ్యాన్స్ చేశారు.
కీరవాణి మ్యూజిక్ అందించగా చిన్నదమ్మే చీకులు కావాలా అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ పాటలో డ్యాన్స్ చేసే సమయంలో రమ్యకృష్ణకు టచ్ కాకుండా డ్యాన్స్ చేయడానికి తారక్ తెగ ఇబ్బంది పడ్డారని సమాచారం.
తన వల్ల రమ్యకృష్ణ ఇబ్బంది పడ్డారేమో అని తారక్ వెళ్లి ఆమెకు సారీ చెప్పగా రమ్యకృష్ణ మాత్రం నువ్వు నన్నేం ఇబ్బంది పెట్టలేదని నీ స్టెప్పులు చూస్తూ నేను కూడా బాగా డ్యాన్స్ చేశానని చెప్పారని సమాచారం.నా అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అత్తాఅల్లుళ్లుగా కనిపించారు.
పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.