ఈ ఇయర్ రాధికా ఆప్టే సత్తా చాటనుంది.. రెండు బడా సినిమాలతో బరిలోకి! 

రాధికా ఆప్టే.బేసిగ్గా సినిమాలతో సంబంధం లేని కుటుంబం వీరిది.ఈమె నాన్న పేరు చారుదత్ ఆప్టే.అతను ఒక్క పుణేలోనే కాదు… మహారాష్ట్ర అంతటా పేరున్న ఓ నరాల వైద్యుడు.అమ్మ జయశ్రీ ఆప్టే పేరున్న మత్తు మందు వైద్యనిపుణురాలు.వీరికి మొత్తం ముగ్గురు సంతానం.

 Radhika Apte Movies Back To Back Radhika Apte, Tollywood, Forensic,  Bollywood,-TeluguStop.com

అందులో ఈమె పెద్దావిడ.ఇద్దరు తమ్ముళ్లు వేరువేరు రంగాల్లో స్థిరపడ్డారు.

రాధికా లండన్‌లో నృత్యం నేర్చుకుని రంగస్థలం మీద నటిస్తూ, అటు నుంచి మరాఠీ రంగానికీ, హిందీ సినీ రంగానికీ పరిచయమయ్యింది.ఈమె సినిమాలు చూసి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహాయకులు చెప్పడంతో, ఆయన ‘రక్తచరిత్ర’ సినిమాకు ఆడిషనింగ్‌కు పిలిచారు.

రాధికా అజ్ఞాతవాసం పూర్తయింది.తర్వాత ఆ ఆడిషన్లో ఎంపికై రక్తచరిత్ర సినిమాలో నటించి, మెప్పించింది.ఇటు ద‌క్షిణాదిలోనూ, అటు ఉత్త‌రాదిలోనూ న‌టిగా త‌న‌దైన ముద్ర వేసిన టాలెంటెడ్ యాక్ట్ర‌స్ రాధికా ఆప్టే.అక్కడితో ఆగకుండా ఆంగ్ల భాష‌లోనూ కూడా కొన్ని చిత్రాల్లో క‌నువిందు చేసి త‌న అభిన‌యంతో ఆక‌ట్టుకుంది.

అలాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ గత కొన్నాళ్లుగా కనిపించడంలేదు.దాంతో చాలా మీడియాలు ఈమె అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయిందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసేశాయి.

అయితే తాజా వార్తతో వారికి ఝలక్ ఇచ్చింది రాధికా.

Telugu Bollywood, Forensic, Hrithik Roshan, Radhika Apte, Saif Ali Khan, Tollywo

ఇవే ఆ రెండు చిత్రాలు:

విషయమేమంటే, ఈ ఇయర్ రాధికకి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది.ఈ సంవ‌త్స‌రం రాధికా ఆప్టే నటించిన రెండు సినిమాలు రిలీజు కానున్నాయి.ఆయా చిత్రాలు ద‌క్షిణాది రీమేక్స్ కావ‌డం గమనార్హం.

అందులో ఒకటి 2020లో వ‌చ్చిన మ‌ల‌యాళ చిత్రం ఫోరెన్సిక్ ఆధారంగా అదే టైటిల్ తో రూపొందనుంది.అలాగే, మరో త‌మిళ చిత్రం విక్ర‌మ్ వేద‌ ఆధారంగా అదే టైటిల్ తో తెర‌కెక్కిన హిందీ సినిమా `విక్ర‌మ్ వేద‌`లో రాధికా మెరవనుంది.

సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోష‌న్ టైటిల్ రోల్స్ పోషించిన ఈ సినిమాలో ఓ కీలక రోల్ ని రాధికా పోషించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube