'NTR30' గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పిన తారక్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఈ సినిమా లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు.

వీరిద్దరూ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.ఇప్పటికే రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాల అప్డేట్ లను ఇచ్చాడు.

అయితే ఎన్టీఆర్ సినిమాల అప్డేట్ ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈ తరుణంలోనే ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా తన నెక్స్ట్ సినిమా అప్డేట్ తెలిపారు .ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.

అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రకటించిన కూడా ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.దీంతో ఈ సినిమా ఉంటుందా ఉండదా అని అంతా అనుకున్నారు.

అయితే తాజాగా తారక్ ఈ సినిమాపై నోరు విప్పడంతో ఈ సినిమా కన్ఫర్మ్ అని తెలుస్తుంది.ఎన్టీఆర్ తన 30వ సినిమా కొరటాల తోనే చేస్తానని.జూన్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు.షూటింగ్ స్టార్ట్ చేయడానికి చాలా సమయం ఉన్న కూడా ఈ ప్రాజెక్టు మీద నే పని చేస్తానని తెలిపాడు.

ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ కోసం ఈ రెండు నెలల సమయం కేటాయిస్తానని తెలిపాడు.

ఈ సినిమా కోసం తారక్ బరువు కూడా తగ్గనున్నాడని తెలుస్తుంది.ప్రెసెంట్ కొరటాల కూడా ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు.ఏప్రిల్ 29న ఈ సినిమా రిలీజ్ చేస్తే కానీ ఆయన ఫ్రీ అవుతాడు ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేయగా.

త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ కోసం చర్చలు జరగనున్నాయి ఈ సినిమాలో ఆలియా భట్ నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube